మనం వాడే నూనె కల్తీనా కాదా ఇలా తెలుసుకోండి?

VAMSI
మనం తినే ఆహారం ఆరోగ్యకరముగా ఉండాలి అంటే ముఖ్యంగా మనం వాడే వంట నూనె ఎటువంటి కల్తీ లేకుండా స్వఛ్చమైనదై ఉండాలి. ప్రస్తుత కాలంలో మార్కెట్ లో రకరకాల నూనెలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ మా నూనె మంచిది అంటే మా నూనె మంచిదని చెప్పుకునేవారే. ప్రజలకు ఏ నూనె స్వచ్ఛమైనది తెలియక తెలుసుకోలేక సతమతమవుతుంటారు. ఏదో ఒక నూనె కదా అని కొనేస్తుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో జీవితం అంటే ఒక వ్యాపారం అయిపోయింది. మార్కెట్లో  కల్తీ పదార్థాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి.  కల్తీ నూనెల వాడకం వలన అనారోగ్య బారిన పడుతున్నాము. కాబట్టి వీటిని ఎలాగైనా అరికట్టాల్సిన అవసరం ఉంది.

వీటిలో కొన్ని రకాల నూనెలో కూడా ఉంటున్నాయి. కానీ ఆ కల్తీ నూనెను ఎలా గుర్తించాలో తెలియక మహిళలు వారికి నచ్చిన నూనె బ్రాండ్ ల తీసుకొని వంటలకు వాడుతుంటారు.  కాగా మన అనుమానాలకు చెక్ పెట్టి పరిష్కారం ఇచ్చేలా ఒక చక్కటి ఉపాయాన్ని మన ముందు ప్రవేశపెట్టింది ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ). తాజాగా వీరు కల్తీ నూనె ఎలా కనిపెట్టాలి అనే దానిపై కొన్ని కీలక విషయాలు తెలియచేశారు. మీరు ఏ నూనెను అయితే తరచూ వినియోగిస్తూ ఉంటారు..

 అందులో కొంత నూనెను గిన్నెలోకి తీసుకుని దాన్ని  కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. కొద్ది సేపటి తర్వాత చూస్తే ఆ  నూనె ఉపరితలంపై తెల్లటి పొర కనుక ఏర్పడి ఉంటే ఆ నూనె నకిలీ నూనె అని అర్దం. అర చేతిలో కొన్ని నూనె చుక్కలను తీసుకుని వేసుకోవాలి. ఆ నూనె చుక్కలను బాగా రుద్దాలి అపుడు  రంగు బయటకు రాకుండా లేదా రసాయనాల  వాసన కనుక వస్తే అది ఖచ్చితంగా కల్తీ నూనె అని గుర్తించవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: