బేబీ స్కిన్ లాంటి మృదువైన చర్మం కావాలంటే... ఈ ఒక్కటి చాలు..!
అయితే చాలామందికి ఈ ప్రోడక్ట్ శరీరానికి సరిపోక అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే డ్రై స్కిన్ నుంచి మృదువైన స్కిన్ పొందాలని భావించే వారు వివిధ రకాల స్కిన్ క్రీములను మానేసి కేవలం వ్యాజిలైన్ ఉపయోగించడం ద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది.
గత కొంతకాలం వరకు డ్రై స్కిన్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా వ్యాజిలైన్ వాడేవారు. ప్రస్తుతం వివిధ రకాల కొత్త ప్రోడక్ట్ లు మార్కెట్లో లభించడం ద్వారా ప్రతి ఒక్కరు వాటిని ఉపయోగించడం వల్ల శరీర సౌందర్యాన్ని పోగొట్టుకుంటున్నారు.బేబీ స్కిన్ లా మీ చర్మం సుతారంగా ఉండాలంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని పెట్రోలియం జెల్లీ ఒక్కటి చాలు. ఇక ఖర్చు విషయానికి వస్తే ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది.
కొంతమందిలో ఆయిలీ స్కిన్ ఉంటుంది.అలాంటివారు వీలైనంత వరకు ఈ పెట్రోలియం జెల్లీ లకు దూరంగా ఉండటం మంచిది.ఈ రెండు కాంబినేషన్ లు కలవడం ద్వారా శరీరం మరింత జిడ్డుగా తయారవుతుంది. డ్రై స్కిన్ ఉన్న వారు తప్పకుండా ఈ పెట్రోలియం జెల్లీ అయినటువంటి వ్యాజిలైన్ ఉపయోగించడం ద్వారా చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది. అదేవిధంగా సహజ సిద్ధంగా లభించే ఎటువంటి ఆలివ్ ఆయిల్, మిల్క్ క్రీమ్,కొబ్బరినూనె ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన చర్మం పొడిబారకుండా ఉండడానికి మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తాయి.