మీరు మరీ సన్నగా ఉన్నారా? అయితే మంచి శరీరాకృతి కోసం ఈ చిట్కాలు పాటించండి.!!!
శరీర బరువు పెంచుకోవడానికి ఎక్కువ క్యాలరీలు అవసరం. అలాంటి వారు పాలు, అరటిపండు, నెయ్యి ఖర్జూరాలు వంటి అధిక ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
బరువు పెరగాలనుకొనే వారు వారి ఆహారంలో రోజుకి రెండు గుడ్లు తప్పనిసరి గుడ్డు సొనలో మంచి కొలెస్ట్రాల్ ఉంటాయి ఇవి శరీర బరువును పెంచడానికి తోడ్పడతాయి.
బరువు పెరగాలనుకొనే వారు ఎక్కువగా సహజ వెన్నను , పెరుగును ఆహారంగా తీసుకోవడం మంచిది.
రోజుకు రెండు సాల్మన్ చేపలు ఆహారంగా తీసుకుంటే మాంసకృత్తులు సరిగ్గా వంట పట్టి క్రమంగా బరువు పెరుగుతారు.
రోజూ ఆహారంలో బంగాళదుంపలు తీసుకుంటే అందులో ఉండే పిండి పదార్థాలు , ప్రోటీన్స్, చక్కెర నిల్వలు సమృద్ధిగా లభించి బరువు పెరగడానికి తోడ్పడతాయి.