ప్రేమ గురుంచి.. శోభిత దూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల గురించి అటు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు  గూఢచారి అనే సినిమా లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయం తో తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది అని చెప్పాలి. అయితే ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవడం తో ఆ తర్వాత కూడా వరుసగా అవకాశాలు అందుకుంది. అదే అడవి శేష్ సరసన మరోసారి మేజర్ అనే సినిమా లో నటించింది శోభిత దూలిపాళ్ల. ఇక పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా నటించి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. అయితే కేవలం సినిమాలలో మాత్రమే కాదు.. వెబ్ సిరీస్ లో కూడా నటించి తన నటనతో ఆకట్టుకుంది.  తన నటనతో ప్రశంసలకు అందుకుంది.  

 అయితే గత కొంతకాలం నుంచి సినిమాలతో కాకుండా పర్సనల్ విషయాలతో సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది.  అక్కినేని నాగచైతన్యతో శోభిత ధూళిపాళ్ల రిలేషన్షిప్ లో కొనసాగుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఏకంగా పర్యటక ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో తీసుకున్న ఫోటోలు పోస్ట్ చేయగా.. ఒకే లొకేషన్ లో వీరిద్దరి  ఫోటోలు ఉండడంతో ఇక వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్న మాట వాస్తవమే అంటూ అభిమానులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు.

 అయితే ఇటీవల ఇంటర్వ్యూ లో పాల్గొన్న హీరోయిన్ శోభిత దులిపాల ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన జీవితంలో ప్రేమ కీలక పాత్ర పోషిస్తుంది అంటూ చెప్పుకోచింది. తను ఎక్కువగా పక్కవారిపై ఆధారపడతానని చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. చిన్న చిన్న ఆనందాలకే పొంగిపోతానని.. సినిమాల్లో తాను చేసిన పాత్రలలాగా తాను అంత స్ట్రాంగ్ కాదు అంటూ తెలిపింది. అయితే శోభిత ఇలా ప్రేమ గురించి చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: