వరల్డ్ కప్ జట్టుపై.. భిన్నంగా స్పందించిన గంగూలీ?

praveen
బీసీసీఐ వెస్టిండీస్ యుఎస్ వేదికల్లో జరగబోయే టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టు వివరాలు ప్రకటించినప్పటి నుంచి కూడా ఒకే విషయంపై భారత క్రికెట్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఐపీఎల్ అదరగొడుతూ సూపర్ ఫామ్ లో కొనసాగుతున్న రింకు సింగ్ ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అయితే బీసీసీఐ వరల్డ్ కప్ జట్టు ప్రకటించక ముందు వరకు కూడా తప్పకుండా రింకు సింగికి వరల్డ్ కప్ జట్టులో చోటు తగ్గుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.

 కానీ ఊహించని రీతిలో ఫామ్ లో లేని హార్దిక్ పాండ్యాను.. ఎంపిక చేసిన సెలెక్టర్లు.. అటు రింకు సింగ్ విషయంలో మాత్రం కనికరించలేదు. దీంతో ఇక వరల్డ్ కప్ జట్టులో దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలి అని కోరిక పెట్టుకున్న ఈ యువ ఆటగాడికి చివరికి అది కలగానే మిగిలిపోయింది. ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న సెలెక్టర్ల నుంచి మాత్రం చేదు అనుభవం ఎదురయింది. అయితే రింకు సింగ్ ని అటు వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేయకపోవడం అంటే అతని బలి పశువును చేయడమే అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా సెలెక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అయితే ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు   నేను చూసిన అత్యుత్తమ జట్టులో ఇక టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టు కూడా ఒకటి  ఈ టీంను ఎంపిక చేయడంలో సెలెక్టర్లు, రోహిత్ అద్భుతంగా పనిచేశారు. అయితే జట్టులో స్పిన్నర్ కావాలి అనుకోవడంతో రింకుకు చోటు దక్కలేదు. అతనికి ఇంకా చాలా కెరియర్ ఉంది  భారత్ తరపున ఇంకా ఆడాల్సి ఉంది. ఈ నిర్ణయంతో బాధపడొద్దు అంటూ సూచించాడు సౌరబ్ గంగూలీ. అయితే వరల్డ్ కప్ జట్టు ఎంపికపై మాజీలు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. సౌరబ్ గంగూలీ మాత్రం మరోలా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: