బాబు ఎన్ని ఎత్తులు వేస్తున్నా.. జగన్‌ కూల్‌గా ఉన్నది ఇందుకేనా?

Chakravarthi Kalyan
ఏపీలో హోరాహోరీగా ఎన్నికలు సాగుతున్నాయి.  ఎన్నికలకు సమయం రోజుల్లోకి వచ్చేసింది. ఈ తరుణంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై జాతీయ మీడియా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ సారి భారీ ఎత్తున ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు, ఎన్డీయేతో పొత్తు, విపక్షాలతో మోదీ బంధం, రాజధాని, ఎన్నికల తర్వాత కేంద్రంలో ఎవరికీ మద్దతు వంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారు అంటూ ఓ సీనియర్ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రతి రాజకీయ పార్టీ సొంత సర్వే చేస్తుందని.. అందులో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు కానీ.. ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా ఉంది. దీని వల్లే అభ్యర్థులను మార్చాల్సి వచ్చింది అని వివరించారు. ఇలా మార్చడం కూడా తన పాలనపై ఉన్న నమ్మకం వల్లే నని తెలిపారు.

వైసీపీతో బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోలేదంటే.. నేను ఎవర్నీ పొత్తు కోసం అడగలేదు. అయినా ఐదేళ్లలో తమ ప్రభుత్వం గొప్పగా పాలించింది. అందుకే తాము ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని వివరించారు. బీజేపీకి పలు అంశాల్లో మద్దతు ఇవ్వడం గురించి వివరిస్తూ.. వారు పెట్టిన బిల్లులు మంచిదైతే మద్దతు ఇచ్చాం. లేకపోతే ఇవ్వలేదు. మేం అంశాల వారీగానే తమ అంగీకారాన్ని తెలిపాం అన్నారు.

హోదా విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అయ్యారు. మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీ. కానీ విభజన చట్టంలో దీనిని కాంగ్రెస్ చేర్చలేదు. ప్రత్యేక హోదా ఏదో ఒక సమయంలో తప్పకుండా వస్తుంది. దిల్లీలో ఎవరూ వచ్చినా వారికి నంబర్లు రాని పక్షంలో ప్రత్యేక హోదా వస్తుంది. అది రియాలటీ అని తేల్చి చెప్పారు. నా ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. నా ఓటమి కోసం ఎన్డీయే కూటమి పోరాడుతోంది. కాబట్టి మేం ఇద్దరిపై యుద్ధం చేస్తున్నాం అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: