ఏపీలో ఆ పార్టీదే హవా.. తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే.?

Pandrala Sravanthi
 ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల చూపంత ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలపైనే పడింది. ఈసారి అక్కడ ఎవరు గెలవబోతున్నారనే విషయం గురించి చర్చించుకుంటున్నారు. అధికార వైసిపి మళ్లీ గద్దెనెక్కుతుందా?  లేదంటే ప్రతిపక్ష టీడీపీ గదనెక్కుతుందా? అనేది చాలా ఆసక్తికరంగా మారింది. దీంతో తెలంగాణలో ఉండే ప్రజలు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మాత్రం  అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ మాత్రం విపరీతంగా ఉంది. ఎవరు గెలిచినా కొన్ని ఓట్ల తేడాతోనే గెలిచే అవకాశం కనిపిస్తోంది.  వన్ సైడ్ వార్ మాత్రం ఏ పార్టీ అభ్యర్థికి లేదని చెప్పవచ్చు.

ఈ విధంగా అద్భుత పోరు జరుగుతున్న నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు టిడిపిదే అధికారం అంటే, మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీదే అధికారం అంటున్నాయి. ఎన్నికలకు 8 రోజుల టైం మాత్రమే ఉంది. ఇప్పటికీ నేతలకు నియోజకవర్గాలపై ఒక అభిప్రాయం అయితే రావట్లేదు. ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల హామీలు ఇస్తూ వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలపై ముందుగానే తెలియజేస్తున్నారు. నేను గెలుస్తాను అంటే నేను గెలుస్తానని బయటకు మాత్రమే చెబుతున్నారు కానీ లోలోపల మాత్రం భయమే ఉందని చెప్పవచ్చు.  ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కొంతమంది కీలక నేతలు  మాజీ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అక్కడ వైసీపీదే విజయం అని చెప్పారు. కానీ బిజెపి సీనియర్ నేత కే లక్ష్మణ్ మాత్రం టిడిపి గెలుస్తుందని జోష్యం చెప్పారు.

ఇలా నాయకులు చెబుతుంటే కొంతమంది ప్రజలు వైసిపి పథకాలు బాగున్నాయని, విద్యా వాలంటీర్ల ద్వారా అవి ఇంటికే చేరాయని, అలాగే విద్యావ్యవస్థ కూడా వైసిపి హయాంలో బాగుపడిందని ఈసారి జగనే మళ్ళీ గెలుస్తారని అంటున్నారు. మరి కొంతమంది ప్రజలు, నిరుద్యోగులు చంద్రబాబు అయితే చాలా సీనియర్ నాయకుడని, ఆయన పాలనలో కరప్షన్ తగ్గుతుందని, ఐటీ రంగం కూడా డెవలప్ అవుతుందని, ఉద్యోగాలు కల్పించడంలో చంద్రబాబు దిట్ట అని అంటున్నారు. ఇలా వైసిపికి, టిడిపికి తెలంగాణ ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టంగానే మారింది. కానీ సెంటిమెంట్ ప్రకారం చూస్తే  అక్కడ ఒకసారి గెలిచినా పార్టీ మరోసారి గెలవడం చాలా కష్టం. తప్పనిసరిగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది. ఈసారి జనసేన, బిజెపి, టిడిపి కూటమిగా కలిసింది కాబట్టి కాస్త చంద్రబాబుదే పై చేయి ఉంటుందని చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: