ఏపీ: కుప్పంలో చంద్రబాబు గెలుపు ఖాయం.. ఆ వ్యూహాలు ఫలించాయి..?

Suma Kallamadi
చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏడుసార్లు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇదే ఆయనకు చిట్టచివరి ఎలక్షన్ కావచ్చు. 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇదే సెంటిమెంట్ ను ఆయన కుప్పం ప్రజల ముందు వినిపించారని తెలుస్తోంది. ముఖ్యంగా నారా భువనేశ్వరి ప్రతి ఇంటికి వెళ్లి "ఏడు పర్యాయాలు గెలిపించి ఆశీర్వదించారు. ఈసారి కూడా గెలిపించండి, ఇది చాలా కీలకమైనది, ఇదొక్కసారి, చివరిసారి గెలిపిస్తే మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం." అని చాలా వినయంగా విజ్ఞప్తి చేశారట.
సంక్షేమ పథకాలు కొనసాగించడమే కాదు, అంతకు మించిన డబ్బులను అందజేస్తామని కూడా హామీ ఇచ్చారట. చంద్రబాబు కూడా ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడారట. అంతేకాదు ఇంతకుముందు ఓన్లీ టీడీపీ వాళ్లకే డబ్బులు ఇచ్చేవారు కానీ ఈసారి అందరికీ 2000 రూపాయలు అందజేశారు. తమను ఓటు వేసి భారీ మెజారిటీతో  గెలిపించాలని మరీ మరీ చెప్పారు. దొంగ ఓట్లు పోయాయి, కొత్తగా వైసీపీ ఓట్లు యాడ్ అయ్యాయి కాబట్టి ఈసారి చంద్రబాబు ఓడిపోవడం ఖాయం అంటున్నారు కానీ బాబు గెలవడానికి ఈసారి చాలా వ్యూహాలు పన్నారు. సెంటిమెంటు వాడుకున్నారు, డబ్బులను కూడా బాగానే ఇచ్చారు, సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇస్తామని హామీ ఇచ్చారు.
 మొత్తం మీద కుప్పం ప్రజలకు తాను గెలిస్తేనే మంచి జరుగుతుంది అనే ఒక భావనను బలంగా తీసుకెళ్లారు. ఈ అన్ని కారణాలవల్ల చంద్రబాబు ఈసారి కుప్పంలో కచ్చితంగా గెలుస్తారు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబు ఓడిపోతారు అని మామూలుగా అంటున్నారు తప్ప ఛాలెంజ్ చేసే రేంజ్ లో స్టేట్మెంట్స్ ఇవ్వడం లేదు. దీన్ని బట్టి వారికి కూడా బాబు విజయం ఖాయం అని తెలిసి ఉంటుంది. చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్ విజయం పైనే అందరికీ దృష్టి ఉంది. గెలుస్తాడా లేదా అనే దానిపై బాగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు విజయం ఖాయమని రాజకీయ విశ్లేషణ చెప్పగలుగుతున్నారు కానీ పిఠాపురంలోన గెలిచేది ఎవరు అనేదానిపై కచ్చితంగా అంచనా వేయలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: