ఒంగోలులో బాలినేని " సిక్సర్ " కొడతాడా.. జనార్ధనరావు ఆపగలడా..??

Suma Kallamadi
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఒంగోలు నియోజక వర్గంలో వైసీపీ నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. టీడీపీ నుంచి దామచర్ల జనార్ధనరావు కాంటెస్ట్ చేశారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలులో ఇప్పటికే ఐదు సార్లు గెలిచారు. మరి ఆరోసారి కూడా ఆయన గెలుస్తారా? లేదంటే దామచర్ల జనార్ధనరావు రెండోసారి విజయ బావుటా ఎగురవేస్తారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బాలినేని వైఎస్ఆర్‌కు బంధువవుతారు, ఆయన వైయస్సార్ రెండో కేబినెట్‌లోనూ చోటు సంపాదించుకున్నారు. వైఎస్సర్ చనిపోయాక జగన్ వెంట నడిచారు. ఆయనకి నమ్మినబంటుగా ఉంటూ వస్తున్నారు. 1999, 2004, 2009 వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన బాలినేని 2014లో జనార్ధనరావు చేతిలో ఓడిపోయారు. 2012లో ఉపఎన్నికలలో పోటీ చేసే గెలుపు సాధించారు.
మళ్లీ 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి ఐదోసారి ఎమ్మెల్యే అయ్యారు. దాని తర్వాత ఒంగోలుకే పరిమితమయ్యారు. అయితే ఈ నేత ఏం మాట్లాడినా ఒక కాంట్రవర్సీ అయిపోయేది. చిన్న తప్పు జరిగినా జనసేన, టీడీపీ నేతలు ఆయన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బాలనేని మంచోడే కానీ ఆయన కుమారుడే దుర్మార్గుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మినట్లుగా అనిపించింది. ఈ వ్యతిరేకతను గ్రహించిన బాలినేని ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అదేంటంటే ఈ ఎన్నికల పోటీనే తనకు చిట్ట చివరిది అంటూ ప్రజల్లో తిరగడం స్టార్ట్ చేశారు.
బాలినేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రిమ్స్ ఆసుపత్రి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, రైతుల కోసం పలు చెక్ డ్యాములు కట్టించి ప్రజలకు మేలు చేశారు. 25 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇప్పించారు. తనపై వస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడుతూనే మంచి పనులతో ప్రజల మనసుల్లో మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.
ఇదిలా ఉంటే 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  దామచర్ల జనార్ధనరావు ఒంగోలును స్మార్ట్ సిటీగా డెవలప్ చేశారు. ఒంగోలు నగరాన్ని అందంగా తీర్చిదిద్దారు. తాను అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే మరింత డెవలప్ చేస్తాననే నినాదంతో 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ప్రజలు బాలినేనిని గెలిపించారు. అయితే జనార్ధనరావు ఓడిపోయిన ప్రతిపక్షపార్టీ నేతగా సక్సెస్ అయ్యారు. బాలినేనిపై చిన్న ఆరోపణ వచ్చినా దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈసారి వీరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది.
బాలినేని తరఫున ఆయన భార్య సచిదేవి, కుమారుడు ప్రణీత్‌రెడ్డి, కోడలు శ్రీకావ్య భారీ ఎత్తున ప్రచారం చేశారు. జనార్ధనరావు తన కుమార్తెలను, భార్యను ఎన్నికల ప్రచారంలో తిప్పారు. ఈసారి 86.46% లేదా 2,03,143 ఓట్లు నమోదయ్యాయి. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు ఏడు వేలు ఎక్కువగా పోలయ్యాయి. ఇవన్నీ వైసీపీకే పడి ఉంటాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడంలో వైసీపీనే పైచేయి సాధించిందని టాక్ నడుస్తోంది. కాపు, బీసీలు, మైనారిటీ వర్గాల ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో వైసీపీ సక్సెస్ సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఓటర్ నాడీని కచ్చితంగా పట్టుకోవడం కష్టం. జూన్ 4వ తేదీనే ఎవరు గెలుస్తారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: