"జామా ఆకుల" తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?

Bhavannarayana Nch

చాలా మంది జామ చెట్లు అంటే కాయలు తినడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటారు అయితే జామ చెట్లలో  ఉన్న ప్రత్యేకత చాలా మందికి తెలియదు..ఈ చెట్లులో కేవలం కాయలు మాత్రమే కాదు ఆకులు కూడా  ఉపయోగపడుతాయి.. జామ చెట్లవల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టే వేల ఏళ్ల నుంచీ మన పూర్వీకులు సైతం ఇంటి పెరటిలో ఈ చెట్లని పెంచడం మొదలు పెట్టారు.. ఉపయోగిస్తారు..అయితే జామ కాయ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అని అందరికీ తెలుసు మరి జామ ఆకులు ఎలా ఉపయోగపడుతాయంటే..

 

జామ ఆకులు జుట్టు సౌందర్యం,చర్మ సౌందర్యం పెంచుకోవాదానికి ఉపయోగపడుతాయి...పూర్వం నుంచీ కూడా భారతీయ స్త్రీలు జామ ఆకులను సౌందర్య పోషణకై మరియు నొప్పి , వాపు నివారణకు వాడతారు.యాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఆక్సిడెంట్ గుణాలు దీనిలో ఉండటం వలన కొన్ని రకాల సమస్యలని ఇది పరిష్కరించగలదు...ఈ ఆకుల్లో ఉండే విశేషాలు తెలుసుకుందాం.

 

జామ ఆకులు బ్లాక్ హెడ్స్ సమస్యలని దూరం చేస్తాయి..ఎలా అంటే కొన్ని జామ ఆకులు తీసుకుని వారిని నీటిలో వేసి మరిగించాలి...తరువాత దీనిని పసుపుని కలిపి మెత్తని ముద్దగా నూరి ముఖానికి పట్టించి మెల్లాగా మర్దనా చేయాలి..ఆ తరువాత చల్లని నీటితో కడిగేయాలి...ఇలా రోజుకి రెండు సార్లు చేయాలి...అంతేకాదు ఈ ఆకులలో ఉండే బాక్టీరియా మొటిమలను కలుగజేసే కణాలను రాకుండా చేస్తుంది...ఇవి చర్మం పై ఉండే నల్లని మచ్చలు, మరకలను తొలగిస్తాయి. అయితే ఇది ఎలా అంటే...కొన్ని జామ ఆకుల్ని తీసుకుని బాగా నలిపి వాటిని మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశాల్లో లేక మొత్తం ముఖానికి పూసుకోవాలి. తర్వాత మామూలు నీటితో కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉంటే తప్పకుండా మొటిమల సమస్య పోతుంది.

 

జామ ఆకులు ముఖంపై వచ్చే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. ఇలా జరగటం వల్ల మీ చర్మం మీద వయస్సు పై బడిన ఛాయలు కనిపించవు. ఎలా అంటే కొన్ని జామ ఆకులను తీసుకుని నీటితో కలిపి మరిగించాలి...ఈ నీరు జామ యొక్క ఎసెన్స్ తో నిండి ఉంటుంది. ఈ నీటిని క్రమం తప్పకుండా ముఖంపై పూసుకుంటే చర్మం కాంతివంతంగా మారి రంగు మెరుగవుతుంది....అంతేకాదు పూర్వం నుంచీ వస్తున్న చిట్కా ఇది ఏంటంటే జామ ఆకులని నీటిలో మరిగించి ఉప్పుని కలిపితే వచ్చిన ద్రావణాన్ని నోటి శుభ్రతకి వాడుతుంటే నోరు దుర్వాసన పోతుంది..అంతేకాదు పుల్లతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు తప్పకుండా జామ పుల్లలతో తోముకుంటే చిగుళ్ళ సమస్యలు ఉన్నా నయం అవుతాయి..





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: