గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..!

Satvika
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలలొ ఎటువంటి మార్పులు లేవు..ఆదివారం మార్కెట్ లో నమోదు అయిన ధరలు ఈరోజు కూడా మార్కెట్ లో నమోదు అవుతూన్నాయి.. ఇది మగువలకు కళ్ళు చెదిరె న్యూస్ అని చెప్పాలీ.ఏప్రిల్ నెలలో బంగారం , వెండి ధరలు నిలకడగానే లేవు. నిన్న కాస్త ఊరట కలిగించిన వెండి ధరలు నేడు మార్కెట్ లో కూడా అదే దారిలో ఉన్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.. ఏది ఏమైనా కూడా బంగారం కొనాలని అనుకొనేవారికి  ఈరోజు మంచి రోజు అనే చెప్పాలి.


మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము..నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,600 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,020గా కొనసాగుతున్నాయి.. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.48,600 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.53,020గా ఉంది. విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు నమోదు అవుతూన్నాయని తెలుస్తుంది.బంగారం ధరలు స్థిరంగా వుంటే .. వెండి ధరలు కూడా అదే దారిలో నడుస్తూన్నాయి.


ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, ముంబైలో మాత్రం రూ.71,500గా ఉంది. అదే విధంగా చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000 ఉండగా, కోల్‌కతాలో రూ.67,000గా కొనసాగుతుంది.. కర్ణాటక బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, విజయవాడలో రూ.71,500 గా నమోదు అవుతున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన మన దేశంలో స్థిరంగా ఉండటం గమనార్హం..బంగారం పై ఎన్నో అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి.. వాటి వల్ల మార్కెట్ లో బంగారం ధరల లో మార్పులు జరుగుతున్నాయి. రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: