వామ్మో.. పిల్లలకు స్కూల్ బ్యాగ్ మోత ఎక్కువైతే.. ఇలాంటి సమస్యలు వస్తాయా?

praveen
సాదరణంగా తల్లిదండ్రులు ప్రతిరోజు పొద్దున్నే పిల్లలను స్కూల్ కి పంపిస్తూ ఉంటారు. అయితే ఇలా స్కూలుకి పంపిస్తున్న సమయంలో ప్రతిరోజు కూడా ఒకే విషయంపై పేరెంట్స్ ఆందోళన చెందుతూ ఉంటారు. అది స్కూల్ పిల్లలు వేసుకునీ వెళ్లే బ్యాగు గురించి. ఎందుకంటే ఏకంగా పుస్తకాలతో నిండి మోయలేనంత బరువుతో ఉండే బ్యాగులను మూసుకుంటూ చిన్నారులు స్కూల్ బస్సు ఎక్కడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అదే బ్యాగులు మోసుకుంటూ వచ్చి తెగ నీరస పడిపోతూ ఉంటారు. అయితే స్కూలుకు వెళ్లి చిన్నారులు అధిక మొత్తంలో బరువులు మోస్తే వెన్నుముక్క సమస్యలు వస్తాయి అంటూ చెబుతున్నారు నిపుణులు.

 అంతేకాకుండా వయస్సును బట్టి ఎంత బరువు మోయాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఆ వివరాలు చూసుకుంటే..
 ఒకటి నుంచి రెండున్నర ఏళ్ల పిల్లలకు కేవలం రెండు కిలోల బరువులు మాత్రమే మోయాలట.
 మూడు నుంచి ఐదు ఏళ్ల వయసున్న పిల్లలు రెండు నుంచి మూడు కిలోల మద్య ఉన్న బరువు బ్యాక్ ఇవ్వాలట.
 6 నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలకు నాలుగు కిలోల బరువు ఉండే బ్యాగ్.. 9 నుంచి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు ఐదు కిలోల బ్యాగ్ ఇవ్వాలట. ఇక స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం ఐదవ తరగతి లోపు ఉన్న పిల్లలకు రెండున్నర కేజీలకు మంచి బరువు ఉండకూడదు. కానీ ప్రస్తుతం పిల్లలు వేసుకుంటున్న బ్యాగులు చేస్తుంటే.. దాదాపు పది నుంచి 15 కిలోల బరువు ఉన్న బ్యాగులను మోసుకు వెళ్తున్నారు.
 అయితే ఇలా పిల్లలు అధిక బరువు ఉన్న బ్యాగులను మోసుకు వెల్లడం వల్ల ఏకంగా వెన్ను సమస్యలు వస్తాయట. అంతేకాదు పాదం పై పట్టు కూడా మారుతుందట. నడక తీరు కూడా మారే ప్రమాదం ఉంటుందట. భుజం నొప్పి వంటివి కూడా బాధిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు. అందుకే పిల్లలకు రెండు వైపులా స్ట్రిప్స్ ఉండే బ్యాగ్స్ ని కొనివ్వడం మంచిది అని సూచిస్తున్నారు. ఎందుకంటే రెండు భుజాలపై ఇక పూర్తిగా బరువు పడుతుంది. కాబట్టి కాస్త వెన్నునొప్పి సమస్య నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: