SSC జాబ్ కొట్టాలనుకున్న వారికి గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల..!!
SSC కంబైన్డ్ హయ్యర్ ఎగ్జామ్ 2021:
1).ఎల్ డిసి/జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ పోస్టులు.
2). సార్టింగ్ అసిస్టెంట్/పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు
3). డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.
అభ్యర్థులు ఈ ssc CHCL ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస విద్యార్హత 12 వ తరగతి పాస్ అయి ఉండాలి.. అంతేకాకుండా అభ్యర్థుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వారి నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి లో సడలింపు ఉండనుంది..obc అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, sc,st, అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్ సడలింపు ఉంటుంది.
అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.. టైర్-1, టైర్-2 ప్రక్రియ లో ఉంటుంది.. చివరిగా టైపింగ్ టెస్ట్ ఆధారితంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందట.
అభ్యర్థులు దరఖాస్తుల ను ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. ఇతరులకు రూ.100 రూపాయలు.sc,st, వికలాంగులకు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
1).అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ.. ఫిబ్రవరి -1
2).అభ్యర్థులు దరఖాస్తుకు చివరి తేదీ.. మార్చి 7-2022
3).దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ..మార్చి 8 2022.
4).కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టెస్ట్.. ఈ ఏడాది మే నెలలో ఉండనుంది.
పూర్తి వివరాల కోసం అభ్యర్థులు :https://SSC.nic.in/ ఈ వెబ్సైట్ లో చూసుకోవాలి. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు కల్పిస్తోందని చెప్పవచ్చు.