చేతిలో డిగ్రీ పట్టా.. నెత్తిపై బస్తా మోత..!

MOHAN BABU
 తన  తల్లి నిత్యం కూలీ పనికి వెళ్తుంటే తండ్రి హమాలీ పనిలో లీనమై చితికిపోయిన జీవితం గడుపుతూ కుటుంబం భారాన్ని మోస్తూ ఉండేవాడు. ప్రతిరోజు తండ్రి పడే బాధలు చూసి  తండ్రి కష్టాలు తీర్చి కుటుంబ ఆదాయాన్ని పెంచడం కోసం "చదువు" ఏకైక మార్గమని నమ్ముకున్నాడు వరంగల్ పట్టణానికి చెందిన రమేష్. 11 ఏళ్ల వయసు వరకు బాగానే ఉన్న రమేష్ ఆ తర్వాత  పోలియో తో కుడి కాలు పనిచేయక వికలాంగుడైనాడు. ఆయన ఆత్మస్థైర్యంతో చదువులో ముందుకెళ్లి ఎంబీఏ పూర్తి చేసుకున్నాడు. తిరగని ప్రదేశం లేదు .అడగని కార్యాలయం లేదు. కంప్యూటర్ కోర్స్ లలో కూడా" ట్యాలీ, ఎమ్మెస్ ఆఫీస్" వంటి చదువులు పూర్తి చేసినప్పటికీ కూడా ప్రైవేటుగాని ప్రభుత్వ ఉద్యోగం గాని అతనికి రాలేదు. ఏ వృత్తిలో నైతే తండ్రిని విముక్తి చేయాలనుకున్నాడో అదే హమాలీ పనిలోకి రమేష్ వెళ్లక తప్పలేదు. పని చేయాలనే తపన కుటుంబానికి  ఆసర కావాలనే ఆరాటం ఉన్నది. కానీ శరీరం సహకరించని కారణంగా రోజుకు అతి తక్కువ బస్తాలు మోయడంతో కనీసం 100 రూపాయలు కూడా రావడం లేదని ఆవేదన పడినటువంటి పస్తం రమేష్ మాటలు అందరిని కంటనీరు పెట్టిస్తున్న వి. ఈ పేదరికానికి తోడు పెళ్లయిన తర్వాత భార్య అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబం మరింత అప్పులపాలు అయిపోయింది. అయినా మొక్కవోని ధైర్యంతో హైదరాబాద్ వంటి నగరాలకు తిరిగి ఉద్యోగం కోసం వేటాడిన ఎక్కడా లభించకపోవడంతో హమాలీ వృత్తిని స్వీకరించాడు.
   
హమాలి వృత్తి గౌరవప్రదమైన దే:-
   ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులు, ఆదాయ వర్గాల అవసరాలను తీర్చేది పేదవర్గాలు అనే విషయాన్ని సమాజం గుర్తించాలి. క్రింది స్థాయి పనులను ఉన్నత వర్గాలు, పెట్టుబడిదారులు అసహ్యించుకోవడం తో పాటు చిన్నచూపు చూస్తారు ఇది నగ్నసత్యం. కానీ ఉత్పత్తిలో  భాగస్వాములవుతున్నారు. అందరికీ అన్నం పెడుతున్నారు అనే విషయాన్ని సమాజం మర్చిపోవద్దు. పస్తం రమేష్ వంటి నిరుద్యోగులు లక్షలాదిమంది ఈ రాష్ట్రంలో దేశంలో పనిచేస్తూ ఉత్పత్తిని పెంచుతూ తమ కుటుంబాలను గడుపుకుంటున్నా ప్రభుత్వపరంగా ఎలాంటి ఆసరా లేకపోవడంతో ఇలాంటి కుటుంబాలు ఎవరికీ పట్టని జీవితాలు నిర్లక్ష్యానికి నెట్టి వేయబడినవి. హమాలీ పని గౌరవప్రదమైన ది. ఆపని చేస్తున్న వారు చిత్తశుద్ధిగా మనస్పూర్తి గా పనిచేస్తూ ఉత్పత్తిలో భాగస్వాములవుతూ సేవారంగంలో కొనసాగుతున్నారు .కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉద్యోగం లేని వారందరూ కూడా హమాలి పని చేసుకో అని అనడం ఆ వృత్తిని, హమాలీ లను కించపరిచేదిగా ఉన్నది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మంత్రిని" మీ పిల్లలు మీరు కూడా హమాలీ పని చేస్తారా" అని ఎదురు ప్రశ్న కూడా వేయడం జరిగింది .ఈ విషయాన్ని ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ ప్రజల జీవితాలు ఎంత నికృష్టంగా ఉన్నాయో తెలుస్తాయి. అందుకు కేవలం ప్రస్తుతం రమేష్ దయనీయ గాథ కేవలం మచ్చుకు, పరిచయానికి మాత్రమే. తోటి మనిషిని సాటి మనిషిగా చూడలేని ఈ వ్యవస్థలో ఆ సంస్కారాన్ని పెంచుకోవాల్సిన అవసరం మాత్రం సమాజంలో అనేక వర్గాల పైన ఉన్నది. ఆ వైపుగా ఆలోచించకుoటే రేపు మనం కూడా పరాన్నజీవులు గా మారక తప్పదు. ప్రభుత్వాలు ఇలాంటి లక్షలాది మందిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా యువతకు సంబంధించి పాలసీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రైవేటు వ్యవస్థల లోపల ఉపాధి కల్పించడానికి చిత్తశుద్ధిగా కృషి చేయవలసిఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: