ఏపిలో విద్యార్థులకు షాక్.. పనివేళల్లో మార్పులు..!

Satvika
కరోనా కారణంగా మూతపడిన స్కూల్స్ , కాలేజీలు ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభం అయ్యాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్నారు. అయితే తొందరగా ఈ ఏడాది విద్యా సంవత్స రంను పూర్తి చేసే ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాఠశాల పని వేళలను మార్చేందుకు సర్కార్ ఆలోచిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు ప్రాథమిక పాఠశాలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ సమయం మార్పు చేశారు. 



మన బడి నాడు-నేడు, మధ్యాహ్న భోజన పథకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నిర్వహించిన సమీక్షలో రాష్ట్రం లోని పాఠశాలలన్నీ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కావాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉదయం వేళ సాధ్యమైనంత త్వరగా స్కూళ్లలో బోధన ప్రారంభించడం మంచిదని సూచించారు. ఉదయం పూట పిల్లల్లో చురుకుదనం బాగా ఉంటుందని, వారి మెదడు కూడా విషయాలను శీఘ్రంగా గ్రహించ గలుగుతుందని, ఆ సమయంలో పాఠ్య బోధన సాగిస్తే పిల్లలు ఆయా అంశాలను తొందరగా పూర్తి చేయవచ్చునని భావిస్తున్నారు.



ఇకపోతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలన్నీ ఉదయం 8 లేదా 8.30 గంటలకల్లా ప్రారంభమవుతున్నాయని, అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఆలస్యంగా 9.30కు ప్రారంభం కావడం వల్ల అనుకున్న ఫలితాలను సాధించడానికి వీలుండదన్న చర్చ జరిగింది. ఈ విషయం లో ఏమైనా ఇబ్బందులుంటే వాటిని పరిష్కరించుకొని రాష్ట్రంలో కనీసం 9 గంటలకల్లా స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.. విద్యార్థుల తల్లి దండ్రులు సర్కార్ వారి నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం మరో సారి మంచి చేస్తుందని అంటున్నారు. విద్యార్థులకు ఇది బ్యాడ్ న్యూస్ అయిన కూడా తరగతులు ముందుకు వెళ్ళాలంటే ఈ నిర్ణయం సరైనదని భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: