ఆలపాటి వర్సెస్ లక్ష్మణరావు గెలుపు గుర్రం ఎవరు..?

frame ఆలపాటి వర్సెస్ లక్ష్మణరావు గెలుపు గుర్రం ఎవరు..?

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .


పైన ప్రచారం ప్రశాంతం. కానీ .. అంతర్గతంగా నాయకుల మధ్య ఉత్కంఠ కూటమీ పార్టీల్లోనూ .. ఏ నాయకుడు ఎవరికి సహకరిస్తున్నాడు ? అన్న చర్చ గ్రాడ్యుయేట్ ఓటర్ ఎలాంటి తీర్పు ఇస్తాడో అన్న ఆసక్తి ఓవరాల్ గా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు చివరి దశలో తీవ్ర ఉత్కంఠ కు గురిచేశాయి. ఈ ఎన్నికలలో ఎవరూ తక్కువ కాదన్నట్టుగా ఎన్నికల ప్రచారం చేశారు. రెండు ఉమ్మడి జిల్లాలలో 3.47 లక్షల ఓటర్లు ఇక్కడ ఎమ్మెల్సీని ఎన్నుకొనున్నారు.


సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇక్కడ బరి లో 25 మంది ఉన్నా . . ప్రధాన పొటీ ఇద్దరి మధ్య సాగింది. కూటమి బలపరిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్.. పిడిఎఫ్ తరఫున మాజీ ఎమ్మెల్సీ కెఎస్. లక్ష్మణ్ రావు మధ్య హోరా హోరీ పోరు సాగింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆలపాట్టి ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. ఈయనకు కూటమి నేతల సహకారం ఉంది. ఆల‌పాటి గెలుపు కోసం కూట‌మి పార్టీల కు చెందిన నేత‌లు అంద‌రూ క‌లిసి క‌ట్టుగా క‌సి తో ప‌ని చేశారు.


ఇక కెఎస్‌. లక్ష్మణరావు.. గతంలో మూడుసార్లు ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయనకు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలలో మంచి పేరు ఉంది. పైగా.. వైసిపి మద్దతు ప్రకటించింది. ఓవరాల్‌గా ఆలపాటి, లక్ష్మణరావు మధ్య ఈ ఎన్నిక అత్యంత ఉత్కంఠగా మారింది. ఉమ్మడి కృష్ణ జిల్లాలోని ఎక్కువ పోలింగ్ నమోదయింది. వివరాలు చూస్తే ఆలపాటికి ముగ్గు ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే లక్ష్మణ్ రావుకు వైసిపి మద్దతు ఎంతవరకు కలిసి వస్తుంది అన్నది రేపు ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: