ఆ విషయంలో చంద్రబాబుని పొగుడుతున్న జగన్?

సీఎం చంద్రబాబు విపక్ష నేత జగన్ ల మధ్య రాజకీయం ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ మీడియా ముఖంగానే మాట్లాడుకుంటారు. మీడియా కేంద్రంగానే విమర్శించుకుంటారు. కౌంటర్లు ప్రతి కౌంటర్లు అన్నీ మీడియా వేదికగానే జరుగుతుంటాయి. సెటైర్లు వేసుకుంటారు. కొన్ని సందర్భాలలో అయితే తీవ్రమైన ఆరోపణలు కూడా చేసుకుంటారు.


లేటెస్ట్ గా చంద్రబాబు మీద జగన్ సెటైర్లు పేల్చారు. అవి ఏంటి అంటే అలా చంద్రబాబుని చూసిన తాను ఆశ్చర్యపోయాను అన్నారు.  ఆయనలో ఎంతో నటనా కౌశలం ఉందని జగన్ అంటున్నారు. ప్రతీ స్కూల్ లో సహజంగానే జరిగే టీచర్ పేరెంట్స్ మీటింగ్స్ కి అదేదో పెద్ద ప్రోగ్రాం గా మార్చి చంద్రబాబు అక్కడ ప్రదర్శించిన నటనా కౌశలం చూసి ఆశ్చర్యపోయాను అని ఎక్స్ వేదికగా జగన్ సెటైర్లు వేశారు.


ఒక వైపు తల్లిదండ్రులకు తల్లికి వందనం పేరుతో కార్యక్రమం అమలు చేయకుండా సున్నం పెట్టిన బాబు పాఠశాలలకు వచ్చి మాత్రం చాలా హడావుడు చేశారని ఆయన విమర్శిస్తున్నారు. రొటీన్ గా జరిగే సమావేశాలను సైతం తన ప్రచార వేదికలుగా మార్చుకోవడంలో బాబుకు ప్రపంచంలోనే సాటి ఎవరూ లేరంటూ జగన్ ఆయనను పొగిడారా లేక విమర్శించారా అంటే ఆలోచించాల్సిందే మరి.


విద్యారంగం తమ హయాంలోనే బాగుందని నాడు నేడు కింద కొత్త గదులను నిర్మించామని ఆయన చెప్పారు. ఇపుడు వాటి పనులు అన్నీ ఆపేశారని పైపెచ్చు ఏదో చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని జగన్ చురకలు అంటించారు.


వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలో ఏకంగా 26 వేల కోట్ల రూపాయలు తమ ప్రభుత్వం ఇచ్చిందని బాబు సర్కార్ మాత్రం ఈ రోజుకు పైసా కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. పాఠశాలలకు వెళ్ళి స్పీచులు ఇచ్చిన సీఎం బాబు డిప్యూటీ సీఎం పవన్ విద్యా శాఖ మంత్రి లోకేష్ తల్లికి వందనం కార్యక్రమం గురించి ఎందుకు మాట్లాడటం లేదని జగన్ నిలదీస్తున్నారు.


మొత్తానికి చూస్తే కనుక చంద్రబాబు నటన బాగుందని జగన్ కితాబు ఇస్తున్నారు.  ప్రపంచంలో ఆయనకు సాటి ఎవరూ లేరని గ్రేటెస్ట్ అంటున్నారు. మరి ఇవన్నీ ప్రశంసలేనా అంటే అది టీడీపీ వైసీపీలకే తెలుసు. అందుకే జగన్ కామెంట్స్ మీద టీడీపీ కామెంట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: