లడ్డూ ట్విస్ట్.. చంద్రబాబు ఎత్తుకి పై ఎత్తు వేసిన జగన్?

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి.. చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమైంది. కలియు వైకుంఠంగా అలరారుతున్న సాక్షాత్తు శ్రీమహావిష్లువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామి వారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.


కోట్లాది మంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడి పడి ఉన్న అంశం కావడంతో అటు జాతీయ మీడియా సైతం దీనికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని.. నాణ్యతా రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు రెండు రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు సరికొత్త వివాదానకి తెర తీసినట్లు అయింది.


దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఎప్పుడేం జరిగిందో వివరించారు. జూన్ 4న చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. జులై 12న నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని గుర్తు చేశారు. 17న అక్కడ టెస్టులు చేశాక రిపోర్టులు సరిగ్గా రాకపోవడంతో ఎనన్డీడీబీకి వివరించారు. ఈ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందనే విషయాన్ని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ అదే నెల 23న తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదిక పంపిందని వివరించారు.


జంతువుల కొవ్వు ఉండటం వల్ల టీడీపీ అధికారులు ఈ నెయ్యిని లడ్డూ తయారీ కోసం వినియోగించలేదని పేర్కొన్నారు. జులై 23న నివేదిక అందితే ఈ రెండు నెలలు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. సూపర్ 6 నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తిరుమల తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఈ వివాదాన్ని ప్రధాని మోదీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారంట. ఈ మేరకు వారిద్దరికీ లేఖ రాయనున్నట్లు జగన్ వివరించారు. సమగ్ర ఆధారాలను జత చేసి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరతానని తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: