నాదెండ్ల మనోహర్‌ ఆ తప్పు చేస్తే.. జగన్‌ విజృంభిస్తారా?

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అన్ని వ్యవస్థల్లో మార్పులు చకచకా జరిగిపోతున్నాయి.  పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయన ముందు ఒక కీలకమైన అంశం ఉంది. అదేంటంటే రాష్ట్రంలో తొలుత రేషన్ షాపులు వద్ద ఇచ్చేవారు. రేషన్ డీలర్లు కమీషన్ పద్ధతిన దుకాణాలను నడిపేవారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికీ రేషన్ వ్యవస్థను తీసుకువచ్చారు. రేషన్ డీలర్లకి, లబ్ధిదారులకు మధ్య మొబైల్ డెలివరీ యూనిట్లను నెలకొల్పారు. రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని మొబైల్ డెలివరీ యూనిట్లలో తరలించి కార్డు దారులకు ఇంటి వద్దనే అందించేవారు.

ఇంటింటికీ రేషన్ సరకులను పంపిణీ చేసేందుకు రూ.538 కోట్లతో 926 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలను కొనుగోలు చేసింది. ఒక్కో వాహనం రూ.581190 ధర పడింది. ఒక్కో వాహనానికి డ్రైవర్ కమ్ సప్లై దారుడు, సహాయకుడు ఒకరు ఉండేవారు. నిర్ణీత సమయంలో ఇళ్ల వద్దకే వాహనం వెళ్లి సరకులను అందించేది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం బాగానే కొనసాగింది.

అయితే ఈ వ్యవస్ఠ పట్ల రేషన్ డీలర్లు అసంతృప్తిగానే ఉన్నారు. తమకు ప్రత్యామ్నాయంగా వాహనాలు రావడం.. చౌక ధరల దుకాణం కేవలం ఒక స్టాక్ పాయింట్ గా మారింది. పైగా వారికి కమీషన్ కూడా పెంచలేదు. దీంతో వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అయితే మళ్లీ ఇప్పుడు రేషన్ ను చౌక ధరల దుకాణం వద్దే ఇప్పించే ప్రయత్నం చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

ప్రస్తుతం రేషన్ డీలర్ల కమీషన్ పెంచేందుకు అధికారులు సమీక్షలు జరుపుతున్నారు. దీంతో పాత పద్ధతినే అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి వాహనాలను ఏం చేస్తారు. ఒకవేళ పాత పద్ధతిన వాహనాల ద్వారా రేషన్ సరకులను పంపిణీ చేస్తే వైసీపీ దానిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుంది. మరి మంత్రి నాదెండ్ల మనోహర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: