చంద్రబాబును చూసి జగన్‌ నేర్చుకోవాల్సింది ఇదే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అసలు పార్టీ ఉంటుందా? ఉండదా? లేదా ప్రత్యర్థుల చేతిలో నిర్వీర్యం అవుతుందా? అనే ఒక రకమైన భయం మాత్రం ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులతో వారంతా బెంబేలెత్తిపోతున్నారు. వారిలో కొంత ఉత్సాహం నింపేందుకు జగన్.. ఒక ఐదేళ్లు కళ్లు మూసుకుంటే సరిపోతుందని ఆ తర్వాత అధికారం మనదే అనే భరోసా  కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ ఈ ఐదేళ్లు అధికార పార్టీ నాయకుల్ని ఎలా ఎదుర్కోవాలో మాత్రం చెప్పడం లేదు. అయితే జగన్ ఇప్పటికి అయినా కార్యకర్తల గురించి ఆలోచించాలని పలువురు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయి.  బాధితులంతా వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, మాజీ మంత్రుల దగ్గరకి వెళ్తున్నారు.  వారేమో లోకల్ గా అందుబాటులో ఉండటం లేదు. విదేశాలకో.. హైదరాబాద్ లోనో ఎంజాయ్ చేస్తున్నారు. కనీసం తమ గోడు వినేవారు లేదని సగటు కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.

ఈ క్రమంలో వైఎస్ జగన్ పార్టీ కార్యకర్తల గురించి ఆలోచన చేయాలి. పార్టీ వారిపై దాడి జరిగితే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వారు నమోదు చేయకపోతే ఆన్ లైన్లో పంపించాలి. ఇలా కూడా ఎఫ్ఐఆర్ కట్టకపోతే కోర్టులో పిటిషన్ వేయాలి. ఇలా ఒక పద్ధతిలో వారికి న్యాయబద్ధంగా ముందుకు వెళ్లాలి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసింది ఇదే.

అందువల్లే ఆ పార్టీ కార్యకర్తలకు భరోసా వచ్చింది. వారిపై ఎన్ని దాడులు జరిగినా బెదరలేదు. క్యాడర్ చెక్కు చెదరలేదు. ఇప్పుడు ఆ ధైర్యాన్ని వైసీపీ నాయకులకు, కార్యకర్తల్లో నూరిపోస్తారా. ప్రస్తుతానికి అయితే పైపైనే దాడుల గురించి, ఓటమి గురించి చర్చలు జరుగుతున్నాయి. దీంతో పాటు ఒకే నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య సమన్వయం కుదిర్చి పార్టీని బలోపేతం చేస్తారా లేక పైపైసమీక్షలు చేసి చేతులు దులుపుకొంటారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: