టీడీపీ : వైసీపీ కీ ప్రతిపక్ష హోదా నో.. జగన్ నెక్ట్ స్టెప్ ఏంటి..?

Divya
ఏపీ ఎన్నికలలో వైసీపీ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కిన విషయం తెలిసిందే. 175 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 11 సీట్లు వచ్చాయి..ప్రతిపక్ష హోదా దక్కాలి అంటే 18 సీట్లు రావాల్సి ఉంది . అయితే ఇటీవల జగన్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు కూడా ఒక్కొక్కరిగా తమ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేశారు.. ఆ తరువాతే తనతో ప్రమాణం చేయించారని జగన్ మనస్థాపానికి గురై స్పీకర్ కు లేఖ రాశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని.. ముందుగానే డిసైడ్ అయినట్లు ఉన్నారని ఆక్షేపించారు.. ఇక తాజాగా మనస్థాపానికి గురైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీకర్ కి లేఖ రాయడంతో ఈ లేఖ పైన మంత్రి  పయ్యావుల కేశవ్ తమ వైఖరి తేల్చి చెప్పేశారు..
జగన్ ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ పై పలువురు మంత్రులు ఒక్కొక్కరిగా స్పందించారు. ఇప్పుడు అధికారికంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. జగన్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది తాము కాదని.. ప్రజలే ఇవ్వలేదని.. జగన్ ఇప్పటికైనా మంచి సలహాదారులను పెట్టుకోవాలని సూచించారు ..జగన్ లేఖ లో ప్రస్తావించినట్లుగా ఉమ్మడి ఏపీ సభలో పి జనార్దన్ రెడ్డికి సిఎల్పీ నేత హోదానే ఉందని.. ప్రతిపక్ష నేత హోదా లేదు అని మరోసారి గుర్తు చేశారు.. తనకు ఓట్లు వేసిన ప్రజలనే తప్పు పడుతున్నారని వ్యాఖ్యానించారు.  

ఇక లోక్సభలో కాంగ్రెస్ కు  201 - 19 సీట్లతో.. 2019 - 24 వరకు కాంగ్రెస్ కి  ప్రతిపక్ష హోదా లభించలేదని.. ఇప్పుడు కాంగ్రెస్ కి  ఆ హోదా దక్కిందని వివరించారు.. అలాగే వైసిపి కూడా పదేళ్లపాటు పోరాటం చేసి ప్రతిపక్ష హోదా తెచ్చుకోవాల్సి ఉంటుందని కూడా తెలిపారు.. అంతేకాదు గతంలో సభలో ఏ పార్టీకి చెందిన సభ్యులు ఉన్నా సరే వారికి పార్టీ పక్ష నేతగా మాత్రమే గుర్తింపు ఉండేది ... ఇప్పుడు మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా మూడు పార్టీలకు శాసనసభ పక్ష నేత ఉంటారని కూడా స్పష్టం చేశారు పయ్యావుల కేశవ్. మొత్తానికైతే జగన్ కూడా తన పార్టీపక్ష నేతగానే ఉంటారని.. ప్రతిపక్ష హోదా రాదు అని తేల్చి చెప్పేశారు. మరి ఈ విషయంపై జగన్ తన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: