రేఖ ఆస్తుల వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా?

Purushottham Vinay
 చాలా మంది నటులు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి బాగా సంపాదిస్తారు. కానీ కొంతమంది మాత్రం ఆ సంపాదనని వృధాగా ఖర్చు చేస్తుంటారు. కెరీర్ లో దూసుకుపోతున్నాం కదా అని ఆ డబ్బుతో ఎన్నో జల్సాలు చేస్తుంటారు. కానీ ముసలి వాళ్లయ్యాక డబ్బులులేక రోడ్డున పడతారు. కానీ కొంతమంది అలా ఉండరు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకుంటారు. అలాంటి వారిలో బాలీవుడ్‌కి వెళ్లి టాప్ హీరోయిన్ గా ఎదిగిన తొలి తెలుగు హీరోయిన్‌ రేఖ ఒకరు. ఇప్పటి దాకా దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రేఖ. అయితే ఆమె కెమెరా ముందుకు వచ్చి పదేళ్లు అవుతోంది. ముందే జాగ్రత్త పడి డబ్బులు, ఆస్తులు సంపాదించుకోకపోతే ఆర్టిస్టుల చివరి రోజులు ఎంత దుర్భరంగా గడుస్తాయో మనం ఇదివరకే చూశాం. తన పిన్ని, మహానటి సావిత్రిలా తన జీవితం కష్టాల మయం కాకూడదని రేఖ అనుకున్నారో ఏమో కానీ దీపం ఉండగానే తన ఇల్లు చక్కదిద్దుకున్నారు. 


ప్రస్తుతం ఆమెకు సినిమా నుంచి సంపాదన ఏమీ లేకపోయినా కానీ తాను ఆస్తులకు మాత్రం కొదవలేదు. ప్రస్తుతం ముంబైలో రేఖ ఉంటున్న ఇంటి ఖరీదు అక్షరాలా వంద కోట్లు ఉంటుంది. ఇక నెల నెలా అద్దెల రూపంలో ఎన్నో లక్షల రూపాయలు నేరుగా వచ్చి ఆమె అకౌంట్‌లో పడుతుంటాయి.అలాగే ఆమెకు బ్యాంక్‌లో ఉన్న ఫిక్సెడ్‌ డిపాజిట్ల సంగతి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్‌ పీక్‌ స్టేజిలో ఉన్నప్పుడు అనవసరపు ఖర్చుల జోలికి పోకుండా తన సంపాదనలో అధిక శాతం ఫిక్సెడ్‌ డిపాజిట్లలో దాచుకొని జాగ్రత్త పడ్డారు రేఖ. ఆమె ఇంట్లో జనాలు కూడా పెద్దగా లేరు. కేవలం ఒక సెక్రటరీ, డ్రైవర్‌ తప్ప. వీళ్లిద్దరూ చాలా ఏళ్ల నుంచి ఆమె దగ్గరే పని చేస్తున్నారు. ఇలా తెలుగుమ్మాయిగా బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కెరీర్ స్టార్టింగ్ లోనే ఎన్నో బ్లాక్ బస్టర్లు బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన రేఖ.. చాలా తెలివిగా తన సంపాదన దాచుకొని ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో హ్యాపీగా బ్రతుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: