శరీరానికి ఫైబర్ ఫుడ్ ఎందుకు అవసరమో తెలుసా..!

lakhmi saranya
ఫైబర్ అనేది మనం తినే ఆహా ర పదార్థాలను సరిగ్గా చేర్ణం చేయడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది శరీరానికి ఎటువంటి పోషకాహారాన్ని అందించినప్పటికీ ఆహారంలో వాటి పరిణామాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీర్ణశైలిని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఫైబర్ ఫుడ్ తిన్న తరువాత కొడుకు చాలాసేపు నిండుగా అనిపిస్తుంది. మరి ముఖ్యంగా అతిగా తినడం నివారించడం ద్వారా బరువు తగ్గవచ్చు. అధిక బరువు ఉన్నవారికి ఇది గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
ఫైబర్ అంటే ఏమిటి.. ఇది శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది.. అనే సంకోచనలు ప్రతి ఒక్కరులోనూ ఉంటాయి. ఇప్పుడు వాటి గురించే మనం తెలుసుకుందాం. ఫైబర్ ఒక రకమైన కార్బోహైడ్రేట్. జీర్ణక్రియకు సంబంధించిన ప్రక్రియలను నిర్వహించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఇది రెండు రకాలు, మొదటిది.. కరిగే ఫైబర్. రెండవది.. కరగని ఫైబర్. కరిగే ఫైబర్ అధికంగా ఉంటే ఆహారాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాలను శరీరంలో ద్రవంగా మార్చడం ద్వారా నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. ఇక మధుమేహం ఉన్నవారి ఆహారంలో ఎక్కువగా కరిగే ఫైబర్ ను చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కరగని ఫైబర్ బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది శరీరంలోని వ్యర్థ  ఆహారాన్ని శుభ్రం చేయడానికి పనిచేస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నియంత్రించుకోవచ్చు. గోధుమపిండి అండ్ పచ్చి ఆకు కూరలు, పాలకూర, టమాటో, ఉల్లిపాయలు, పప్పులు, బత్తాయి, శనగపిండి, ద్రాక్ష, యాపిల్, బొప్పాయి మొదలైన వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహం లేదా ఊబకాయం సమస్య ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది. అందువల్ల మన శరీరానికి ఫైబర్ ఎంతో అవసరం. చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారు వరకు ఫైబర్ కంటెంట్ వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: