Kalki 2898 AD: థర్డ్ రేట్ హాలీవుడ్ కాపీ తీసిన నాగ్ అశ్విన్.. జనాల్ని వెర్రోళ్లని చేశాడే??

Suma Kallamadi
"కల్కి 2898AD" సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీని ద్వారా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ స్టాండర్డ్స్ పెంచేశారని, కల్కి ఒక మాస్టర్ పీస్ అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. రూ.600 కోట్లు పెట్టి చాలా సంవత్సరాల తీసిన ఈ సినిమా జస్ట్ రెండు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూలు చేసి వావ్ అనిపించింది. అయితే ఈ సినిమాని ఏదో మాస్టర్ పీస్ లాగా మహాకావ్యం లాగా అనుకుంటే పొరపాటు చేసినట్లే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా వందల కోట్లతో తీసి వేల కోట్లు సంపాదించడమే నాగ్‌ అశ్విన్ లక్ష్యం అని అంటున్నారు.

భారతీయ పురాణ గాథలో మంచి చరిత్ర కలిగిన పాత్రలు సెలెక్ట్ చేసుకోవడం నేటి దర్శకులకు అలవాటుగా మారింది. ఈ చరిత్రను తీసుకొని హాలీవుడ్ లాగా చిత్రాలను మలుచుతున్నారు. అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే గ్రాఫిక్స్ యాడ్ చేస్తున్నారు. ఫైట్ తర్వాత ఫైట్ పెట్టి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కలిగేస్తున్నారు. ఓ గర్భవతితో సెంటిమెంట్ పుట్టిస్తున్నారు. ఆవిడకి పుట్టబోయే బిడ్డే
‘దేవుడు’ అని జనాన్ని మాయ చేస్తున్నారు. ఒక పార్ట్‌ తీస్తే డబ్బులు తక్కువ వస్తాయని రెండో పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అది చూడడమే భారతీయ ప్రేక్షకులందరికీ జీవిత లక్ష్యం అనే లాగా ప్రచారం చేస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న తెలుసుకోవడానికి జనం ఎలా ఆశ పడ్డారో మనందరికీ తెలుసు.

అలా ప్రతి సినిమా ద్వారా క్రియేట్ చేసి సీక్వెల్ సినిమా కూడా చూసే లాగా చేయాలనుకుంటున్నారు. తలపండిన విశ్లేషకులు కల్కి సినిమా హాలీవుడ్ మూవీలకు ఒక థర్డ్ రేట్ కాపీ అంటున్నారు తప్ప అందులో పెద్ద గొప్పతనం లేదని కొట్టి పారేస్తున్నారు. ఇందులో ప్రభాస్ చాలా పిల్లి మొగ్గలు వేస్తాడు. బలహీనమైన అమితాబ్‌ బచ్చన్ 20 మంది గాల్లోకి ఎత్తి పారేస్తుంటాడు. ఇది ఫాంటసీ మూవీ కాబట్టి ఇందులో అన్నీ చెల్లుతాయి. నిజానికి ఒక పాతాళభైరవి బాహుబలి మహానటి కేజిఎఫ్ లాంటి సినిమాలు ప్రేక్షకులను రంజింపజేశాయి కానీ కల్పి అనేది ఒక కల్తీ సినిమా కాబట్టి గందరగోళం లో ప్రేక్షకులను పడేసిందని అంటున్నారు. ఏదో తాపత్రయంతో నాగ్‌ అశ్విన్ ఈ సినిమాని అర్థం కాకుండా చిందర వందరగా తీసేసాడని అంటున్నారు. ఏది ఏమైనా ఈ మూవీకి పెట్టిన బడ్జెట్ నేటితో తిరిగి వచ్చేసింది. ఇంకా దీనికి హైప్‌ తగ్గలేదు థియేటర్లకు ప్రేక్షకులు వెళ్తూనే ఉన్నారు. దీన్నిబట్టి ఈ మూవీ గట్టెక్కినట్లేనని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: