సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ప్రధాన పాత్రలలో స్టార్ హీరోయిన్స్ నటిస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్స్ ను లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ప్రధాన పాత్రలలో తీసుకోవడానికి దర్శకులు , నిర్మాతలు ప్రధాన ప్రాముఖ్యతను ఇవ్వడానికి ప్రధాన కారణం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో మంచి క్రేజ్ ఉన్న నటి మణులు ఉన్నట్లయితే ఆ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడే అవకాశం చాలా వరకు ఉంటుంది. దానితో సినిమాకి మంచి టాక్ వచ్చినట్లయితే ఆ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది. దానితో స్టార్ ఈమేజ్ ఉన్న హీరోయిన్లనే ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఓ యంగ్ బ్యూటీ తాజాగా ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించి అదిరిపోయే రేంజ్ విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును సొంతం చేసుకుంది. స్టార్ హీరోల రేంజ్ కలెక్షన్లను ఆ మూవీ తో వసూలు చేసింది.
ఇంతకు ఆ నటిమని ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె ఎవరెవరో కాదు ... కళ్యాణి ప్రియదర్శన్. ఈమె ఇప్పటివరకు పలు తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈమె తాజాగా మలయాళం లో రూపొందిన లోకా చాప్టర్ 1 అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను మలయాళ భాష తో పాటు అనేక భాషలలో కూడా విడుదల చేశారు. ఈ మూవీ కి సూపర్ సాలిడ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ లోని కళ్యాణి ప్రదర్శన్ నటనకి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 303 కోట్ల వరకు కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ ఏకంగా స్టార్ హీరోలా సినిమాల రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ తో కళ్యాణి ప్రియదర్శిన్ కి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు వచ్చింది.