ఏంటి? భైరవ రోల్కి ఫస్ట్ ఆ హీరోని అనుకున్నారా?

Purushottham Vinay
ఏంటి? భైరవ రోల్కి ఫస్ట్ ఆ హీరోని అనుకున్నారా?

 

ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ సినిమా అదరగోడుతుంది. అతి త్వరలో రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపికా, దిశా పటాని లాంటి స్టార్స్ నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో భైరవగా ప్రభాస్ తన యాక్షన్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాడు. కానీ నాగ్ అశ్విన్ ఈ రోల్ ని మొదట వేరే హీరోతో చేద్దాం అనుకున్నారట.మహానటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రెస్‌మీట్ జరిగింది. ఆ మీట్‌లో నాగ్ అశ్విన్‌ను, నిర్మాత అశ్వినీదత్‌ను ప్రశంసలతో ముంచెత్తారు చిరంజీవి. అయితే ఆ సందర్భంగా వారి మధ్య జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్ ఆలోచన వచ్చింది. అయితే ఆ ఆలోచన మాత్రం అలాగే ఆగిపోయింది.


ఆ తర్వాత కొద్ది రోజులకు చిరంజీవిని కలిసి నాగ్ అశ్విన్ తాను రాసుకొన్న కల్కి కథను ఆయనకి వినిపించాడు. ఆ కథ విన్న వెంటనే సినిమా కథ చాలా బాగుంది. తప్పకుండా అద్బుతమైన విజయాన్ని అందుకొంటుందని మెగాస్టార్ అన్నారట. నాగీ కథ చెప్పిన విధానం.. అతడి విజన్‌కు చిరు ఎంతో ముచ్చటపడ్డారట.అయితే చిరంజీవి ప్రశంసలు గుప్పించడంతో నాగ్ అశ్విన్ తన మనసులో ఉన్న మాటను బయటపెడుతూ ఈ సినిమా కథ మీ కోసమే రాశాను. మీరు ఒప్పుకొంటే మీతో సినిమా చేయాలనే ఆలోచన ఉంది అని చెబితే.. వెంటనే చిరంజీవి అందుకు నిరాకరించి ఈ సినిమాలోని భైరవ పాత్రను నేను చేస్తే సెట్ కాదు అని తన జడ్జిమెంట్‌ను ఇచ్చారట.అంతేగాక చిరంజీవినే స్వయంగా భైరవ పాత్రకు ప్రభాస్ అయితే కరెక్ట్ పర్సన్ అని అతనితో సినిమా తీస్తే కథకు న్యాయం జరిగి రీచ్ ఎక్కువగా ఉంటుందని తన అభిప్రాయాన్ని మెహమాటం లేకుండా చెప్పారట చిరంజీవి. దాంతో ఈ కల్కి సినిమా ప్రాజెక్టు ప్రభాస్ వద్దకు వెళ్లింది. ప్రస్తుతం ఆ సినిమా హిస్టరీ క్రియేట్ చేసేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: