ఓటిటిలో రికార్డ్ సృష్టిస్తున్న కాజల్ "సత్యభామ" ఏకంగా ఇప్పటికే అన్ని వ్యూస్..?

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది . ఈ మూవీ విడుదలకు ముందు కాజల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను చాలా రోజులు చేయడం , అలాగే ఈ మూవీ రిలీజ్ కి ముందు ఈ చిత్రం నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బా గా ఆకట్టుకోవడంతో మంచి అంచనాల నడుమ ఈ సినిమా జూన్ 7 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది.

ఇక మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్లను రాబట్టలేదు. ఇక ఈ సినిమా ద్వారా కాజల్ అగర్వాల్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిలింది. ఇక ధియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. ఇక థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా ఓ టి టి ప్రేక్షకులను మాత్రం అలరించడంలో బాగానే సక్సెస్ అయ్యింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్  లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించి ట్రెండింగ్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: