జగన్ కుటుంబ కథా చిత్రం : జగన్ నీ జనాలకు దూరం చేయడానికి షర్మిల ఆ ప్లాన్ వేసిందా..?

Pulgam Srinivas
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైసిపి పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ స్థాపించిన తర్వాత 2014వ సంవత్సరం మొదటి సారి ఈ పార్టీ ఎన్నికలలో దిగింది. ఈ ఎన్నికలలో వైసీపీకి పెద్ద స్థానంలో అసెంబ్లీ స్థానాలు రాలేదు. ఇక 2014 నుండి 2019 వ సంవత్సరం వరకు ఈ పార్టీని నడిపిన వ్యక్తులలో జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిల కూడా ముఖ్యలే. కొంతకాలం పాటు జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల పార్టీ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంది. 2

019 వ సంవత్సరం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలను తెచ్చుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కావడంలో కూడా షర్మిల కీలక పాత్రను పోషించింది. ఇక అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి మధ్య మనస్పర్ధలు వచ్చి దూరం అయ్యారు. దానితో షర్మిల ఆంధ్ర రాజకీయాలపై దృష్టి పెట్టకుండా తెలంగాణ రాజకీయాలపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది.

తెలంగాణ రాజకీయాలలో ఈమె ఫెయిల్ కావడంతో మళ్ళీ తిరిగి ఆంధ్ర రాజకీయాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చూసుకుంటుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో కూడా షర్మిల తన గెలుపు కంటే కూడా తన సోదరుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి కోసమే ఎక్కువగా పని చేసినట్లు కనిపించింది. ఇకపోతే జులై 8వ తేదీన వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి జరగనుంది. కొన్ని రోజుల క్రితమే భారీ ఓటమి దక్కడంతో జగన్ , రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇక షర్మిల మాత్రం ఈ వేడుకలను అత్యంత గ్రాండ్ గా నిర్వహించబోతోంది. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య తో పాటు మరి కొంత మంది ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా అనేక మంది ప్రముఖులను రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకకు షర్మిల తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వారంతా వచ్చినట్లు అయితే షర్మిల క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే జగన్ జనాలకు మరింత దూరం అయ్యే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: