ఏపీ: వాలంటరీ సేవలలో మార్పు.. కాల పరిమితి కూడా..?

Divya
ఆంధ్రప్రదేశ్ లో వాలంటరీ వ్యవస్థ పైన ఇప్పటికీ ఎంతో చర్చ కొనసాగుతూనే ఉంది  ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లను పక్కనపెట్టి మరి సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ వంటివి పంపిణీ చేయడంతో వాలంటరీ లు సైతం కాస్త ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ రోజున విజయవాడకు వెళ్లి ధర్నా చేయాలనుకున్నారు వాలంటరీలు.. కానీ తాజాగా వాలంటరీ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయం పైన కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వాలంటరీల కొనసాగింపు పైన సానుకూలంగానే ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా కొత్త ప్రతిపాదనలు తెరమీదకి వస్తున్నట్లు తెలుస్తోంది.. వైసీపీ ప్రభుత్వంలో వాలంటరీ సేవలు మొదలయ్యాయి.. ఎన్నో ప్రభుత్వ పథకాలు అమలు కావడానికి వాలంటరీల  తీరు చాలా కీలకంగా  వ్యవహరించారని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో వాలంటరీల పైన వివాదాలు మొదలైనప్పటికీ.. చివరికి అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు గౌరవ వేతనం అందిస్తామంటూ కూటమి సభ్యులు తెలియజేశారు. అయితే మొదటి నెల పెన్షన్ పంపిణీ లోనే వాలంటరీలను తప్పించడంతో కూటమి ప్రభుత్వం పైన వాలంటీర్ల నిర్ణయం ఏంటి అనే విషయంపై కొత్త ప్రతిపాదనలు విషయానికి వస్తే..

వాలంటరీల ఉద్యోగానికి నిర్దిష్ట కాల పరిమితి ఉండాలని.. మూడేళ్లు నుంచి వాలంటీర్ గా కొనసాగించకూడదని ప్రతి మూడేళ్లకు కొత్త వారిని నియమించే విధంగా ఒక ప్రతిపాదన తీసుకు వస్తోందట. వాలంటరీల పేరు మార్పును కూడా గ్రామ సేవక్, వార్డు సేవక్ అనే పేరుతో మార్చి అంశం పైన కూడా ఆలోచిస్తోందట ఏపీ ప్రభుత్వం. అంతే కాకుండా వారికి మరిన్ని పనులు అప్పగించాలని పథకం కింద లబ్ధిదారులకు చేసే డబ్బు పంపిణీతో వాలంటీలకు సంబంధం లేకుండా చేయాలని ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. అయితే గతంలో 50 ఇళ్లకు ఒక వాలంటరీ ఉండగా ఇక మీద వంద ఇళ్లకు ఒక వాలంటరీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు రాబోతున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: