కల్కి ఎఫెక్ట్: టాలీవుడ్లో దిశా దశ తిరుగుతుందా?

Purushottham Vinay

ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన కల్కి 2898 ఏడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ఊచకోత కోస్తున్నది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సీ అశ్వినీదత్ 600 కోట్లతో రూపొందించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది.అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకోన్ నటించిన ఈ సినిమా అదరగోడుతుంది. అతి త్వరలో రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపికా, దిశా పటాని లాంటి స్టార్స్ నటించారు. అయితే వీళ్ళలో దిశా పటాని చిన్న యాక్టర్. ఆమెకి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న సినిమాల పరంగా పెద్ద హిట్స్ ఏమి లేవు. తెలుగులో 'లోఫర్' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ హిందీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు జోడీగా నటించిన 'ఎంఎస్ ధోని - అన్ టోల్డ్ స్టోరీ' సినిమా ఫస్ట్ సక్సెస్ రుచి చూసింది. ఆ వెంటనే 'కుంఫు యోగా' అనే చైనీస్ సినిమాలో జాకీ చాన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంది. 'బాఘీ 2' హిట్టయినా.. 'మలంగ్', 'రాధే', 'ఏక్ విలన్ రిటర్న్స్' లాంటి మూవీస్ అమ్మడిని నిరాశ పరిచాయి. కొన్ని స్పెషల్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ చేసినా లాభం లేకుండా పోయింది. చివరగా దిశా దశ మార్చేస్తుందని ఆశలు పెట్టుకున్న 'యోధ' సినిమా కూడా దెబ్బకొట్టింది. 


ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో, ఇక హాట్ బ్యూటీ కెరీర్ కష్టమే అని అనుకున్నారంతా. అలాంటి టైంలోనే 'కల్కి 2898 AD' సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది దిశా. దాదాపు 9 ఏళ్ల తర్వాత తెలుగులో చేసిన రీఎంట్రీ సినిమా ఇది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీ పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ వసూళ్లతో బాక్సాఫీసు దగ్గర రికార్డులు తిరగరాస్తోంది. దీంతో దిశా పటాని మరోసారి లైట్ లోకి వచ్చింది. 'కల్కి' మూవీలో ప్రభాస్ ప్రేయసిగా రాక్సీ పాత్రలో నటించిన దిశా పటాని. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినప్పటికీ, ఉన్నంతలోనే హాట్ గా తన ఉనికిని చాటుకుంది. స్క్రీన్ మీద ఎంతో అందంగా కనిపించి సైన్స్ ఫిక్షన్ మూవీకి  గ్లామర్ అద్దింది. డార్లింగ్ ప్రభాస్ తో కలిసి చేసిన రొమాంటిక్ యాక్షన్ సీన్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. 'టా టక్కర' సాంగ్ లో కాంప్లెక్స్ లో అందాలు ఆరబోసి టాలీవుడ్ జనాల దృష్టిలో మళ్ళీ పడింది. దీంతో ఈ బ్యూటీపై టాలీవుడ్ నిర్మాతల కన్ను పడింది. స్టార్ హీరోస్ సినిమాల్లో దిశా బ్యూటీ యాడ్ చేస్తే ఖచ్చితంగా అదిరిపోతుందని భావిస్తున్నారు. మరి తెలుగులో దిశా దశ తిరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: