కల్కి డే 2 కలెక్షన్: రెండవ రోజు భారీగా పడిపోయిన కల్కి కలెక్షన్స్.. రీజ‌న్ ఇదే..!

lakhmi saranya
ప్రభాస్ నటించిన లేటెస్ట్ ఫిలిం కల్కి మూవీ భారీ హైప్ ఉన్న కారణంగా తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. పైగా ఈ మూవీకు కూడా అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో రెండో రోజు నుంచి ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని భావించినప్పటికీ అది నిజం కాలేదు. శుక్రవారం అనగా జూన్ 28 మాత్రం ముందస్తు అంచనాల ప్రకారం ఏకంగా 46% వరకు పడిపోయినట్లు sacnilk. Com వెల్లడించింది.
నా గశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి రెడీ మూవీకి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 191.5 కోట్లు వచ్చాయి. ఇక తొలి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. గురువారం అనగా జూన్ 27 హాలిడే కాకపోయినా కూడా ఈ స్థాయి కలెక్షన్స్ రావడం  ఆశ్చర్యం కలిగించింది. ఇక లెక్కన రెండో రోజున శుక్రవారం కలెక్షన్లు పెరగాల్సి ఉంది. కానీ కలెక్షన్స్ విపరీతంగా పడిపోయాయి. Sacnilk. Com ప్రకారం ఈ సినిమా రెండో రోజు ఇండియా నెట్ కలెక్షన్లు 51 కోట్లుగా ఉన్నాయి.
ఇక ఇందులో తెలుగు నుంచి 24.65 కోట్లు, తమిళ్ నుంచి 3.5 కోట్లు, హిందీ నుంచి 20.5 కోట్లు, కన్నడ నుంచి 0.3 కోట్లు అండ్ మలయాళం నుంచి రెండు కోట్లు వచ్చినట్లు తెలిపింది. నిజానికి తొలి రోజు ఇండియా నెట్ కలెక్షన్లు 95.3 కోట్లుగా ఉండగా సుమారు 46% పడిపోయాయి. ఇక తొలి షో నుంచే సినిమాకు ఎక్కడా నెగిటివ్ టాక్ రాలేదు. అయినా రెండో రోజు కలెక్షన్స్ పడిపోయాయి. సెకండ్ మళ్లీ ఈ కలెక్షన్లు రెట్టింపు కావచ్చు అని అంచనా వేస్తున్నారు. శని ఆదివారాల్లో మరోసారి కల్కి సినిమాకి రికార్డు కలెక్షన్లు రావడం ఖాయం అంటూ తెలియజేస్తున్నారు.  శుక్రవారం అనగా జూన్ 28 మాత్రం ముందస్తు అంచనాల ప్రకారం ఏకంగా 46% వరకు పడిపోయినట్లు sacnilk. Com వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: