ఆ విషయంలో విశ్వక్ సేన్ తోపు.. స్టార్ హీరోలకు కూడా ఆ విషయం కష్టమే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ నటుడు ఇప్పటివరకు నటించిన సినిమాలలో ఏవో ఒకటి , రెండు సినిమాలు మినహాయిస్తే అన్ని మూవీలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. కానీ ఈయన నటించిన సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చినా కూడా ఈయన సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసి విజయం వైపు దూసుకు వెళుతున్నాయి. అందులో భాగంగా కొంత కాలం క్రితం ఈయన నటించి , దర్శకత్వం వహించిన దాస్కా దమ్కి మూవీ కి విడుదల అయిన మొదటి రోజే నెగటివ్ టాక్ వచ్చింది.

అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ను చాలా రోజులు చూపించి చివరగా విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ నటుడు గామి అనే వైవిధ్యమైన సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే మిక్స్ డ్ టాక్ లభించింది. దానితో ఈ సినిమా ద్వారా విశ్వక్ కి అపజయం వస్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా చాలా రోజులు మంచి కలెక్షన్ లను వసూలు చేస్తూ చివరగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా, అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు కూడా విడుదల అయిన మొదటి రోజు నెగటివ్ టాక్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ గా నిలిచినట్లు ప్రకటించింది. ఇలా ఈ నటుడు తాను నటించిన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ లను అందుకుంటూ వెళుతున్నాడు. ఇలా స్టార్ హీరోలకు కూడా జరగడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs

సంబంధిత వార్తలు: