కల్కి టికెట్స్ కోసం విపరీతంగా కాల్స్ వస్తున్నాయి : బాహుబలి నిర్మాత
ఈ సినిమా ట్రైలర్ లో వచ్చే విజువల్స్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా వున్నారు.కల్కి సినిమా కథ భారతీయ పురాణాలకు క్లైమాక్స్ వంటిది అని నాగ్ అశ్విన్ తెలిపిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో అమితాబ్ అశ్వద్దామ పాత్రలో నటిస్తున్నాడు. కమల్ హాసన్ కల్కిగా కనిపించునున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో తన పాత్రలో నెగటివ్ షేడ్స్ కూడా ఉండనున్నట్లు ఇటీవల ప్రభాస్ తెలిపిన సంగతి తెలిసిందే..ఇదిలా ఉంటే తాజాగా కల్కి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే.. తాజాగా అన్ని థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.. దీనితో కల్కి టికెట్స్ కోసం భారీగా డిమాండ్ పెరిగింది.కల్కి మూవీ టికెట్స్ కోసం తనకు చాలా కాలం తరువాత వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేసారు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు.