ఏపీ: వాలంటరీ వ్యవస్థ రద్దు పై ఏపీ మంత్రి సమాధానం ఇదే..?

Divya
ఆంధ్రప్రదేశ్లో వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ పైన గతంలో టిడిపి జనసేన నేతలు సైతం చాలా రకాలుగా కామెంట్స్ చేయడం జరిగింది. గతంలో ఈ వాలంటరీ వ్యవస్థను కూడా చాలా చిన్న చూపుగా చూసి మాట్లాడడం జరిగింది. కానీ అనూహ్యంగా ఎన్నికల ముందు వాలంటరీలకు 5000 జీతం కాదు పదివేలు చేస్తామంటూ కూటమి తెలియజేసింది. దీంతో వాలంటరీ గా పనిచేసే వారందరూ కూడా చంద్రబాబుకు మద్దతు పలికినట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఎన్నికలలో వాలంటరీల వ్యవహారం పెద్దగా కనిపించకపోవడంతో ఇప్పుడు అయోమయంలో పడింది కూటమి.

ఈసారి పింఛన్ పంపిణీ వ్యవస్థను సచివాలయ సిబ్బందితోనే ఇంటికి వెళ్లి ఇచ్చేలా ప్లాన్ చేశారు. వాలంటరీ వ్యవస్థను కూడా పక్కనపెట్టి సచివాలయ ఉద్యోగులని పెన్షన్ పంపిణీ చేయించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్యాబినట్లు నిర్ణయం తీసుకోవడంతో అసలు వాలంటరీలను ఉన్నిస్తారా లేదా అనే విషయం కూడా క్లారిటీ రాలేదు.. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి డొల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వీటి పైన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది.. వాలంటరీ వ్యవస్థ రద్దు పైన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు అంటూ తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ దివ్యాంగుల, సీనియర్ సిటిజన్ ,సచివాలయం, గ్రామ వాలంటీర్ల శాఖలుగా శ్రీ బాల వీరాంజనేయ బాధ్యతల సైతం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీని వెలుగులోకి తీసుకురావడమే తమ లక్ష్యం అంటూ తెలిపారు. అలాగే గత ప్రభుత్వం 3,573,22 కోట్ల బకాయిలు సైతం ఉంచారు అంటూ తెలియజేశారు. ఈ భారం మొత్తం కూడా ప్రభుత్వం మీదే ఉన్నదని తెలియజేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థను సైతం టిడిపి నేతలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల ముందు వాలంటరీ వ్యవస్థ పైన యూటర్న్ తీసుకొని మరి వరం కురిపించడం జరిగింది. ప్రస్తుతం వాలంటరీ వ్యవస్థను ఉన్నిస్తారా లేదా అనే విషయం దుమారంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: