జగన్‌: వైసీపీ పండగ చేసుకునేలా.. కేంద్రం నివేదిక?

విద్యుత్తు రంగంలో వైఎస్ జగన్ ప్రభుత్వం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. విద్యుత్ రంగాన్ని ఉజ్వలంగా తీర్చిదిద్డంతో పాటు భవిష్యత్తు తరాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ సరఫరా, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడే పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించింది.

గత ఐదేళ్లుగా ప్రణాళికా బద్ధంగా విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతోంది. విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులను స్థాపించడానికి పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020ని ప్రభుత్వం ప్రకటించింది. పవన, సౌర, చిన్న జల, పారశ్రామిక వ్యర్థాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను కొత్తగా నెలకొల్పేందుకు తోడ్పాటు నందించింది. సీఎం జగన్ ప్రత్యేక చొరవతో ప్రణాళిక బద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులతో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

రాష్ట్రంలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో భాగంగా నెల్లూరు జిల్లా కృష్ణ పట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ పవర్ స్టేషన్ లో 800 మెగా వాట్ల యూనిట్ ను సీఎం జగన్ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఎన్టీడీపీఎస్ లో 800 మెగావాట్ల యూనిట్ సీవోడీ పూర్తి చేసుకొని అందుబాటులోకి వచ్చింది. ఈ 1600 మెగావాట్లతో కలిపి జెన్ కో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6610 మెగా వాట్లకు పెరిగింది.

వీటితో పాటు ఇంధన రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పలు జాతీయ అవార్డులు లభించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డును వరుసగా రెండేళ్లు రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది.  ఏపీ ట్రాన్స్ కో , నెడ్ కాప్, ఏపీకి మూడు ఎనర్షియా అవార్డులు వచ్చాయి. ఏపీ ఎస్పీడీసీఎల్ కు రెండు జాతీయ అవార్డులు లభించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ మన రాష్ట్రంలోని ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపణీ సంస్థలు అత్యుత్తమని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్ఈసీ ప్రకటించింది. వీటితో పాటు ఏపీలోని మూడు డిస్కంలకు ఏ గ్రేడ్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: