చంద్రబాబు: రఘురామను బలిపశువును చేసినట్టేనా?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఏ పార్టీలో చేరకుండా మిన్నుకుండిపోయారు. మూడు పార్టీల కూటమిలో ఏదో ఒక పార్టీ ఎంపీగా అవకాశం ఇస్తుందనే ఆశతో ఉన్నారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎవరికీ దక్కినా సీటు  తనకే అనే ధీమాలో పూర్తి నమ్మకంతో ఉన్నారు. కానీ ఆయనకు మొండి చేయి చూపుతూ బీజేపీ అక్కడ తన అభ్యర్థిని ప్రకటించింది.

అక్కడి నుంచి శ్రీనివాస శర్మ పోటీలో ఉన్నారు. మరోవైపు ఆయన ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు కూడా. ఇదిలా ఉండగా రఘురామ మాత్రం తనకు టికెట్ వస్తుందనే పూర్తి నమ్మకంతో ఉన్నారు. కానీ ఈ ఆశలు కూడా అడియాసలైనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ తమ చివరి జాబితాను కూడా విడుదల చేసింది.  టీడీపీ పెండింగ్ లో ఉంచిన విజయనగరం అయినా తనకు దక్కుతుందని ఆయన భావించారు. కానీ అక్కడి నుంచి టీడీపీ తన అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడి పేరును ప్రకటించి ఆర్ ఆర్ ఆర్ మైండ్ బ్లాంక్ చేసింది.

వాస్తవానికి రఘురామకి ఇంత ఫాలోయింగ్ రావడానికి కారణం వైసీపీలో ఉంటూ సీఎం జగన్ ని విమర్శించడం. ఈ మూలంగా ఓ వర్గం మీడియాకు దగ్గరయ్యారు. ఈయన్ను అడ్డుపెట్టుకొని జగన్ వ్యతిరేకులకు సీఎంను తిట్టించారు.  కానీ సీటు విషయానికొచ్చే సరికి నరసాపురాన్ని టీడీపీ తీసుకోకుండా ఆ సీటును బీజేపీకి బదలాయించి రఘురామకి సీటు ఇవ్వలేదనే నెపాన్ని ఆ పార్టీపై చంద్రబాబు నెట్టేశారు.

అయినా రఘురామ తన టికెట్ ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోవడం లేదు.  తాజాగా భీమవరం చేరుకున్న ఆయన అక్కడ జనసేన, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా వాళ్ల పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని చెబుతున్నారంట. నేను అయితే ఆర్థికంగా మీకు మద్దతు ఇస్తాను. ఈ విషయంపై మాట్లాడండి అంటూ సూచిస్తున్నారంట. అయితే సీటు విషయం బీజేపీ అధిష్ఠానం దగ్గర ఉందనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారు. వీలైతే దిల్లీ వెళ్లి మాట్లాడాలి కానీ ఇలా చేయడం వల్ల ఉపయోగం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: