నేపాల్‌లో ప్రజావిప్లవం.. భారత్‌కు అనుకూలమా?

కొత్త ఎప్పుడూ వింతగానే ఉంటుంది. పాత అనేది రోతగా కనిపిస్తుంది. ఇది రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అధికార పార్టీ ఎంత చేసినా.. కొత్తగా వచ్చే ప్రభుత్వం ఇంకా ఏమి చేస్తుందో అనే ఉద్దేశంతో వారికి అవకాశం ఇస్తుంటాం. గతంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంతో దేశాన్ని ఏలుతున్న సమయంలో టీడీపీ ఆవిర్భవించింది.

కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందిన ప్రజలు టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించారు.  రెండు సార్లు ఆ టీడీపీని ఆదరించారు.  ఆ తర్వాత తిరిగి మళ్లీ కాంగ్రెస్ బాట పట్టారు. మధ్యలో టీడీపీ ప్రస్తుతం వైసీపీకి అధికారం అప్పజెప్పాం. ఇలా మారుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి. రాజకీయ నాయకులు ఇలా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. హామీలను ఎరగా చూపి అధికారం దక్కించుకోవాలని చూస్తుంటాయి. ప్రస్తుతం నేపాల్ పరిస్థితి ఇలానే తయారైంది.

అక్కడ కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం పాటు కొనసాగిన రాచరిక పాలనపై ప్రజల్లో విరక్తి కలిగించారు. దీంతో రాజు తీసుకునే నిర్ణయాలతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. ఒక కమ్యూనిస్టు ఐడీయాలజీ ని వారిలో కలిగించడంలో విజయవంతం అయ్యారు. తిండి ,బట్ట, వసతి లాంటివి కమ్యూనిస్టు రాజ్యంలోనే వస్తాయనే భావన వారిలో కలిగించి చైనా ప్రచారంతో అక్కడి రాజరిక పాలనను అంతమొందించి వీరు పాలన చేపట్టారు. ఇదే క్రమంలో భారత్ పై కూడా విద్వేషాన్ని నూరిపోశారు. ఫలితం అందరూ కమ్యూనిస్టు భావజాలాన్ని వంటపట్టించుకున్నారు.

రోజులు గడుస్తున్న కొద్దీ అక్కడ పరిస్థితులు మారిపోయాయి. సంక్షోభం తలెత్తింది. భారత్ పై ఆధారపడి జీవించాల్సి వస్తోంది.  ఈ దశలో ఇప్పుడు కథ మారింది. అక్కడి ప్రజలకు కమ్యూనిస్టులపై విరక్తి కలిగింది. ఈ ప్రభుత్వాలు మాకు వద్దంటూ రాచరికపు పాలన కావాలని కోరుకుంటున్నారు. ఆనాటి రాజరికపు కుటుంబ వారసులతో మళ్లీ రాజ్య భారం తీసుకోవాలని వేడుకుంటున్నారు. మళ్లీ హిందుత్వ రాజ్యం కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు ఇలా రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్న వారి సంఖ్య లక్షలకు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: