అంతా ఏకమయ్యారు.. జగన్ తట్టుకోగలడా?

గత ఎన్నికల్లో వైసీపీ అంతు లేని విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జగన్ అన్ని వర్గాల్లో అనుకూల ప్రచారం చేయడంలో విజయవంతం అయ్యారు. ఆ మతం ఈ మతం అనే తేడా లేకుండా అందరిలోనను పాజిటివ్ కోణం తేవడానికి చాలామంది కష్టపడ్డారు.  ఈ సారి ఎన్నికలకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. గత ఎన్నికల్లో ఎవరికి వారు విడిగా పోటీ చేసిన రాజకీయ పార్టీలన్నీ కూటమిగా కలిశాయి.

గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన షర్మిళ  ఈ సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి అన్నపైనే బాణాలు సంధిస్తున్నారు. మరో సోదరి సునీత దిల్లీ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అన్నకు ఓటు వేయోద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.  ఇలా చాలమంది జగన్ సర్కారు పై ఏకంగా యుద్ధమే ప్రకటించారు. మరి వీరిని జగన్ ఎలా ఎదుర్కొంటారనేదే ఇప్పుడు ప్రశ్న.

సాంతం పక్కకి వెళ్తారా.. లేక వీళ్లనే పక్కకి తప్పిస్తారా అనేది ఎన్నికల తర్వాత తేలనుంది. ఈ దఫా ఎన్నికల సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటం కాదని.. రాద్ధాంతాల మధ్య జరుగుతోంది అని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. జగన్ వర్సెస్ చంద్రబాబు, పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులు, కాంగ్రెస్, బీజేపీ ఇలా ఒక్కరిపై ఇన్ని పార్టీలు దాడి చేస్తున్నాయి. ఇందులో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నా.. వీరి వెనుక అదృశ్య శక్తులున్నాయనేది వాస్తవం.

ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలతో పాటు బ్రదర్ అనీల్ కూడా జతయ్యారు. ఏపీలో అప్పులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రేపు పుట్టబోయే బిడ్డలపై కూడా అప్పుల భారం పడే పరిస్థితి ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు. ఒక మత ప్రబోధకుడిగా జగన్ ని గెలిపించడం అంటే దేవుడిని మోసం చేయడమేనని తేల్చి చెప్పారు. శత్రువులందరూ నాశనం అయిపోవాలని ఆయన శపించడం మరో విశేషం. ఇంత మంది జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మరి జగన్ వీటిని ఎలా తిప్పికొడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: