భారత్‌ను మెచ్చుకుంటున్న పాకిస్తాన్‌?

భారత్ లో అయితే పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడినా.. ఇండియా పై పాక్ గెలిచిన సందర్భంలో సంబురాలు జరిపి పాక్ జెండాను ఎగుర వేసినా ఏం మాట్లాడేవారు ఉండరు. భావ ప్రకటనా స్వేచ్ఛ, స్వాతంత్ర్యపు హక్కు అని డైలాగులు చెబుతూ ఉంటారు. అదే పాక్ లో మాత్రం ఇండియాకు అనుకూలంగా మాట్లాడినా.. నినాదాలు చేసినా రాళ్లతో దాడులు చేసేవారు, సామాజిక బహిష్కరణ చేసేవారు.

మన దగ్గర మాత్రం ఇలాంటి పరిస్థితులు కనిపించవు. ఈ మధ్య మాత్రం పాక్ లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఒకేసారి ఇరు దేశాలకు స్వాతంత్ర్యం వచ్చినా మన దేశం టాప్ 5 ఆర్థిక దేశాల్లో ఒకటిగా నిలిచింది. మరోవైపు పాక్ మాత్రం ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టుడుతోంది. ఆహారం లేక.. ఉద్యోగ ఉపాధి అకవాశాలు కల్పించ లేక ఉగ్రవాదంతో , సైన్యం పెత్తనంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

పొరుగు దేశమైన భారత్ లో జరుగుతున్న వృద్ధిని ఆ దేశ రాజకీయ నాయకులు గుర్తిస్తున్నారు. గతంలో బహిరంగ ప్రదేశాల్లో ఇండియా పేరు ఎత్తితే కొట్టి చంపే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏకంగా పార్లమెంట్ లోనే మన గురించి ప్రస్తావన రావడం అక్కడ మార్పు మొదలైంది అని చెప్పడానికి సంకేతం.

గత ఎన్నికల సమయం నుంచే ఇమ్రాన్ ఖాన్ భారత్ గురించి అనుకూలంగా మాట్లాడటం ప్రారభించారు. మరోవైపు ప్రస్తుత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ కూడా భారత్ ఏమో జాబిలి పైకి వెళ్తుంటే మనం మాత్రం ఇక్కడే ఆగిపోయాం అని ఎన్నికల సమయంలో వ్యాఖ్యానించారు. తాజాగా ఆ దేశ ప్రధానిగా షరీఫ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో  ఇమ్రాన్ పార్టీకి చెందిన ఎంపీలు భారత్ తీరును చూసి నేర్చుకోండి. వారి విధానాలను మనం కూడా అనుసరిద్దాం అని సూచించారు. పార్లమెంట్ లో భారత్ పేరు తీసుకురావడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: