బాబు, జగన్‌లను తొక్కడం పవన్‌ వల్ల అవుతుందా?

జనసేన సీట్లపై కాపు సామాజిక వర్గ నేతలు ఆగ్రహాంగా ఉన్నారు. కేవలం 24 సీట్లతో రాజ్యాధికారం సాధ్యమా.. అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం ఉందా.. అని రకారకాల ప్రశ్నలు సంధించే ముందు పవన్ ని ఓసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.  పవన్ ని సీఎం కుర్చీలో చూద్దామని కాపు నేతలు, జనసైనికులు భావిస్తున్నారు.

కానీ ఇది సాధ్యం కాదని పవన్ కు తెలుసు. చంద్రబాబు,  జగన్ లు ఒక్కసారిగా ఓడించి సీఎం పదవిని అధిరోహించడం కష్టమే. తాను ఒంటరిగా సాధించలేనని తెలిసే టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు.  వాస్తవంగా చెప్పుకుంటే అటు చంద్రబాబు నాయుడు కానీ.. ఇటు జగన్ ఇద్దరూ ఆర్థిక దిగ్గజాలే. వీరిని సాధారణ పవన్ కల్యాణ్ ఢీ కొట్టగలడా అంటే కచ్ఛితంగా కాదు. ఆ పార్టీ అధినేతలతో పాటు రూ.వందల కోట్లు ఖర్చు పెట్టే నాయకులు టీడీపీ, వైసీపీలో ఉన్నారు.  

ఇటు ప్రజలు సైతం డబ్బులకు అలవాటు పడిపోయారు. వారికి అవినీతి లేకి పాలనతో సంక్షేమం కావాలి… తమ బాధలు తీర్చాలి.. మళ్లీ ఓట్లకు డబ్బులివ్వాలి. లేకపోతే వాళ్లు ఓటేయడం మానేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేనే జీరో పాలిటిక్స్ చేస్తానంటే ప్రజలు ఆదరిస్తారా.. అలా గతేడాది ఎన్నికలకు వెళ్లే దెబ్బతిన్నారు. డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేమని పవన్ కి అర్థం అయింది.

అందుకే ముందుగా 24 సీట్లు తీసుకొని.. కనీసం పదిహేను చోట్ల అయినా  తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహించాలి. ఆ తర్వాత చంద్రబాబు, జగన్ లు ఒకరినొకరు అణగదొక్కితే ఆస్థానాన్ని తాను భర్తీ చేద్దామనే ఆలోచనలో జనసేనాని ఉన్నారు. ప్రణాళిక బాగానే ఉన్నా.. ఆచరణలో మాత్రం పవన్ విఫలం అవుతున్నారు. ఎందుకు అంటే ఇప్పటి వరకు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసింది లేదు. పార్టీ నాయకుల్ని తయారు చేయలేదు. మరోవైపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో చంద్రబాబు ఉండే వ్యూహాలు ఆయనకు ఉండవా.. దీంతో పాటు కేంద్రాన్ని ఎదురించి మరీ పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ కు ప్రత్యేక ప్రణాళికలు ఉండవా.. ఎవరి వ్యూహాలు వారివి. కాబట్టి పవన్ వీటన్నింటిని గమనించి ముందు పార్టీని సంస్థాగత బలోపేతం పై దృష్టి సారించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: