2024 వైసీపీ మేనిఫెస్టో... ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఈ సారి బంగార‌మేనా..?

RAMAKRISHNA S.S.
- 25 వేల వ‌ర‌కు జీతం పొందే ఉద్యోగుల‌కు న‌వ‌ర‌త్నాల వ‌ర్తింపు
- ఇళ్లు లేని ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సొంత జిల్లాలోనే స్థ‌లాలు, 60 % ఖ‌ర్చు భ‌రింపు
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ తన మేనిఫెస్టోలో బంపర్ వరాలు ప్రకటించారు. వాస్త‌వానికి గ‌త ఐదేళ్ల‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు ఆగ‌క‌పోయ‌నా వారంతా అసంతృప్తితో ఉన్నారు. ఓపిఎస్ విధానానికి వెళ్లలేకపోయిన ఉద్యోగుల భద్రత, భవిష్యత్తు తరాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పదవి విరమణ చేయబోతున్న ఉద్యోగుల కోసం ఇప్పటికే జిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చారు. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు ఇప్పటికే పెంచారు. అలాగే అంగన్వాడి వర్కర్లు.. హెల్పర్లు.. పారిశుద్ధ్య కార్మికులు.. హోం గార్డులు ఇలా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను గతానికి భిన్నంగా భారీగా పెంచారు.

ఫలితంగా రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరింది. అలాగే ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా ఏటా ప్రభుత్వంపై ఏటా రు. 3600 కోట్ల భారం పడుతుంది. 50 వేలకు పైగా దీనివల్ల లబ్ధి జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ద్వారా పరిహారం అందుకు మంచి చేశారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ కూడా కల్పించారు. ఇక వచ్చే ఐదేళ్లలో కూడా విద్యార్థులకు ఏం చేస్తానో జగన్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. జగన్ అన్న విదేశీ విద్యాదీవెన‌కు ఎంపిక అని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకునే రుణములో పది లక్షల వరకు పూర్తి వడ్డీ.. కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్లపాటు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

అలాగే 25 వేల వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్య, వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో విద్యా, వైద్యానికి, ఇళ్ల‌కు సంబంధించిన అన్ని నవరత్నాలు వారికి వర్తించేలా హామీ ఇచ్చారు. అలాగే ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలలోనే ఇళ్ల స్థలాలు, నిర్మాణంలో 60% ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: