కొడుకుకు తాతగా నటిస్తోన్నటాలీవుడ్ టాప్ కమెడియన్..!!
ఆ సినిమా కబుర్లు చెప్పారు. నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా అన్నీ ఓకే అయినట్టు తెలిపారు. ఇక తాత పాత్ర ఉందని, హీరోకి తాతగా చేయాలని, డైలాగులు కూడా ఉన్నాయని తెలపగా, ఎవరికైనా చెప్పాలా? అని ఫోన్ తీశాడు బ్రహ్మీ.. కానీ మీరే చేయాలని చెప్పడంతో షాక్ అయ్యాడు. దీంతో కాసేపు ఆవేశానికి గురై తాను తాతగానా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. చివరికి టైటిల్ ఏంటని అడగ్గా, బ్రహ్మా ఆనందం అని చెప్పడం విశేషం. ఆద్యంతం ఫన్నీగా, హిలేరియస్‌గా ఉన్న ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇందులో రాజా గౌతమ్ హీరోగా, ఆయనకు తాతగా బ్రహ్మీ కనిపించబోతున్నారు.ఇందులో వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు. స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్క నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుంది. అయితే తాజాగా ఇందులో రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబర్ 6న సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. మొత్తంగా తండ్రీ కొడుకులు కలిసి ఏమాత్రం నవ్విస్తారో చూడాలి.ఇక రాజా గౌతమ్ పదేళ్లకి ఓ సినిమా చేసుకుంటూ వచ్చాడు. ఆయన 2004లో పల్లకిలో పెళ్లి కూతురు సినిమా చేశాడు. పాటలు బాగున్నా, సినిమా పెద్దగా ఆడలేదు. డిఫరెంట్ ఫిల్మ్ అనిపించుకుంది. ఆ తర్వాత పదేళ్లకి బసంతి చేశాడు. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆరేళ్ల క్రితం మను మూవీతో ప్రయోగం చేసినా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తండ్రితో కలిసి బ్రహ్మా ఆనందం సినిమా చేస్తున్నాడు. మరి ఈ మూవీతోనైనా హిట్ అందుకుంటాడా? బ్రహ్మానందం పేరు నిలబెడతాడా? అనేది చూడాలి.