బంధం ముగిసినా అనుబంధం ముగియదు.. ఏపీకి హైదరాబాద్ ఎప్పటికీ స్పెషల్!

Reddy P Rajasekhar
పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు మరికొన్ని గంటల్లో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ హైదరాబాద్ ప్రత్యేకమే అని చెప్పవచ్చు. బంధం ముగిసినా అనుబంధం ముగియలేదని ఎప్పటికీ అనుబంధం ముగియదని ఏపీవాసులు చెబుతున్నారు. ఏపీ వాసులకు హైదరాబాద్ తో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.
 
హైదరాబాద్ ను మరికొన్ని సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతుండగా నాగార్జున యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ఏకంగా 30 సంవత్సరాల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పిలుపునిచ్చింది. విభజిత ఏపీకి చెందిన ఎంతోమంది చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాద్ లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ స్థిరపడి ఆర్థికంగా కూడా నిలదొక్కుకున్నారు.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయినా రెండు రాష్ట్రాల ప్రజలు అన్నాదమ్ముల్లా కలిసి ఉన్నారు. హైదరాబాద్ స్థాయి రాజధాని ఏపీకి కూడా అవసరం కాగా వైజాగ్, అమరావతిలలో రాజధాని ఏదో ఎన్నికల ఫలితాల తర్వాత తేలిపోనుంది. వైజాగ్ ను రాజధానిగా ప్రకటిస్తే మరింత వేగంగా ఏపీ అభివృద్ధి చెందే ఛాన్స్ అయితే ఉందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
 
అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే మాత్రం అభివృద్ధి జరగడానికి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉమ్మడి రాజధానిని కోల్పోతున్న నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర నేతలు మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. విశాఖకు త్వరలో ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ క్యాప్ జెమినీ కూడా రానుందని సమాచారం అందుతోంది. ఏపీలో ఎక్కువ సంఖ్యలో వైట్ కాలర్ జాబ్స్ కల్పించే దిశగా భవిష్యత్తు సీఎం అడుగులు వేయాల్సి ఉంది. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా మిస్ అవుతున్నామనే భావన మాత్రం చాలామందిలో ఉందని కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: