ఏపీ రాజ‌కీయాలు - బ‌క‌రాలు - బ‌లిప‌శువులు: బాలాజీ పని గోవిందా..??

Suma Kallamadi
ఏపీ రాజకీయాల్లో ఓడిపోతారని తెలిసి కూడా ఆయా పార్టీలో కొంతమందిని నిలిచాబెట్టాయి. వారిలో వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ ఒకరు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ రెండుసార్లు టీడీపీయే విజయ బావుటా ఎగరవేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సాంబశివరావు, వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ ఎన్నికలబరిలోకి దిగారు. కాగా ఈసారి ఇక్కడ నుంచి టీడీపీ నాయకుడు సాంబశివరావు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయనను ఓడ కొట్టడం దాదాపు అసాధ్యమని తెలిసినా బాలాజీకి టికెట్ ఇచ్చి అతడిని బలి పశువును చేసింది వైసీపీ.
ఏలూరి సాంబశివరావు టీడీపీ టికెట్‌పై పోటీ చేసి వరుసగా రెండుసార్లు గెలిచారు. ఈసారి కూడా ప్రజలు అతన్ని గెలిపించుకుంటారని తెలుస్తోంది . రాజకీయ విశ్లేషకుల ప్రకారం పర్చూరు నియోజకవర్గానికి వైసీపీ ఇన్చార్జిగా రామనాథం బాబును నియమించారు. అయితే అతను సరిగా పనిచేయలేదు. ఇది గమనించిన వైసీపీ అధిష్టానం అతడిని తొలగించి ఆమంచి కృష్ణమోహన్‌ను ఇన్చార్జిగా ఎంపిక చేసింది.
కృష్ణమోహన్‌ ఆ పదవి చేతికి దొరకగానే గ్రానైట్ ఇండస్ట్రీలపై పెత్తనం చూపించడం ప్రారంభించారు. లోకల్ వైసీపీ లీడర్లకు కేసులు పెట్టి చుక్కలు చూపించారు. ఆయన చేసిన ఒకే ఒక పని ఏడు వేల టీడీపీ ఓట్లను తొలగించడం. ఆపై వైసీపీని వీడి హస్తం కండువా కప్పుకున్నారు. అలా పర్చూరులో చాలానే ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి వైసీపీ ఎవరిని నిలబెట్టాలో అర్థం కాక చాలా ఆలోచించేసింది. ఇక ఇక్కడి నుంచి ఎవరిని నిలబెట్టినా ఓడిపోతారని ఎడం బాలాజీని సెలెక్ట్ చేసింది. దానితో పాటు అతను బకరా అయ్యాడు. బాలాజీని కాపు కోటాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దింపింది. ఇక్కడ బాలాజీ ఓడిపోవడం ఖాయం అని తెలిసినా వైసీపీకి మరో మార్గం లేక అతనినే రణరంగంలోకి దింపింది.
బాలాజీ గెలవడానికి బాగానే కష్టపడ్డారు కానీ ప్రజల ఆదరణను పొందలేకపోయారు. ఈ నియోజకవర్గంలో 70 వేల కమ్మ ఓట్లు, 40 వేల కాపు ఓట్లు ఉన్నాయి. ఈ రెండు సామాజిక వర్గాలు ఎవరి వైపు ఓట్లు వేస్తే వాళ్ళు ఈజీగా గెలిచేస్తారు. కాగా కాపు ప్రజల్లో సగం మంది టీడీపీకే ఓట్లు వేసినట్లు తెలిసింది. ఇక 80% కమ్మ ప్రజల ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే పడిపోయాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే వైసీపీ అభ్యర్థి ఎడం బాలాజీ ఓడిపోయినట్లే. జూన్ 4వ తేదీన ఆ విషయం మరింత స్పష్టం కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: