ఉమ్మడి రాజధాని వల్ల పదేళ్లలో ఒరిగింది ఏమీ లేదా.. నమ్మకపోయినా నిజమిదేనా!

Reddy P Rajasekhar
ఏపీకి పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఈ పదేళ్లలో ఒరిగిందేమీ లేదా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పాలకుల నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినా ప్రయోజనాలను పొందే విషయంలో ఏపీ వాసులు ఫెయిల్ అయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాజధానిని మరికొన్ని సంవత్సరాల పాటు కొనసాగించినా లాభం మాత్రం ఉండదని తెలుస్తోంది.
 
చంద్రబాబు, జగన్ లలో ఎవరో ఒకరు ఏపీకి సీఎం అవుతారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరూ కూడా ఉమ్మడి రాజధాని కావాలని డిమాండ్ చేయడం లేదు. ప్రధాన నేతలకు ఉమ్మడి రాజధాని కావాలనే ఆకాంక్ష లేని నేపథ్యంలో ఈ నేతలు ఉమ్మడి రాజధాని కోసం ప్రయత్నించే అవకాశాలు కూడా తక్కువని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి మాత్రం లెక్కలు తేలాల్సి ఉందని భోగట్టా.
 
ఏపీలో ఎవరు సీఎం అయినా ఆ నేతలతో సత్సంబంధాలను కొనసాగిస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందువల్ల రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కారం కావడానికి ఎక్కువ సమయం అయితే పట్టదని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ఏపీ నేతలు హైదరాబాద్ లో ఏపీ వాటాను తేల్చుకుంటే సరిపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
లెక్కల ప్రకారం ఏపీకి 1,25,000 కోట్లు రావాల్సి ఉందని సమాచారం అందుతోంది. ఈ సమస్య మాత్రం ఇప్పటికీ పరిష్కారం కావాల్సి ఉందని తెలుస్తోంది. ఆంధ్రా వాళ్లలో చాలామంది హైదరాబాద్ లో ఉద్యోగాలు చేస్తూ ప్రశాంతమైన జీవనం గడుపుతున్నారు. ఉమ్మడి రాజధాని కావాలని ఏపీ నేతలు ఇంకా కోరుకుంటే అత్యాశే అవుతుందని అలా జరగడం వల్ల ఏపీ అభివృద్ధి మరింత ఆలస్యమవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాజధాని వల్ల ఏపీకి పెద్దగా లాభమైతే కలగలేదని నమ్మకపోయినా నిజం ఇదేనని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: