కుప్పం: బాబుకి పోటీగా భరత్? బలిపశువయ్యిందెవరు?

Purushottham Vinay
•బాబుకి ధీటుగా చెవి రెడ్డి ఫ్యామిలీని పోటీగా పెట్టకుండా తప్పు చేసిన వైసీపీ

•సామాన్యుడు భరత్ ని బాబుకి పోటీగా పెట్టి బలిపశువుని చేసిన వైసీపీ

కుప్పం - ఇండియా హెరాల్డ్ : రాబోయే ఎన్నికల ఫలితాల్లో కుప్పం కింగ్ చంద్రబాబే అంటున్న టీడీపీ తమ్ముళ్లు ఆయన మెజార్టీపై భారీ అంచనాలని వేసుకుంటున్నారు.రికార్డు స్థాయిలో లక్ష ఓట్ల ఆధిక్యత సాధిస్తామంటున్నారు కుప్పం టీడీపీ తమ్ముళ్లు.. అయితే ముఖ్యనేతలు మాత్రం అంతరాదు. కాని పక్కాగా మంచి మెజార్టీ వస్తుంది అంటున్నారు. గత ఎన్నికల్లో మొదటి రౌండ్ లో టీడీపీకి 50 మైనస్ అయింది. అయితే ఈపారి మాత్రం 50 వేల మెజార్టీ దాటుతుందని కోట్లలో బెట్టింగ్స్ సాగుతున్నాయి. వైసీపీ మాత్రం పక్కాగా చంద్రబాబు మెజార్టీ గణనీయంగా తగ్గుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది.కానీ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెజార్టీపై కుప్పంలో జోరుగా పందాలు సాగుతున్నాయి. అమెరికా నుంచి అనంతపురం దాకా సీబీఎన్ మెజార్టీపై బెట్టింగులు భారీగా నడుస్తున్నాయి. గత ఎన్నికలలో జరిగిన అనుభవాలతో చంద్రబాబు ఈసారి రెండు సంవత్సరాల ముందు నుంచి కుప్పంపై దృష్టి పెట్టారు. సీనియర్ నాయకులను పక్కన బెట్టి యువకులకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. అన్ని వర్గాలను కూడా సమన్వయం చేసుకునే బాధ్యతలు ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్‌కు అప్పగించారు.వైసీపీ తరపున ఎమ్మెల్సీ భరత్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

అలాగే జగన్ కూడా మూడు సార్లు కుప్పంలో పర్యటించారు.వైనాట్ 175 అనే స్లోగన్ కూడా కుప్పం నుంచే జగన్ మొదలు పెట్టారు. స్థానిక సంస్ధల ఎన్నికలలో గెలుపుతో చాలామందిని కూడా తమ పార్టీలో చేర్చుకున్నారు. అయితే రాజాకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబుకి ధీటుగా భరత్ ని పెట్టి ఆయన్ని బలిపశువుని చేశారని తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకులు ఆయనకి బలమైన సీనియర్ అభ్యర్థిని వైసీపీ పోటీగా పెట్టి ఉంటే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి చెవిరెడ్డి ఫ్యామిలీకి మంచి పట్టుంది. ఆ ఫ్యామిలీ నుంచి వైసీపీ బాబుకి పోటీగా అభ్యర్థులని పెడితే బాగుండేది. ఒక సామాన్యుడు అయిన భరత్ ని పోటీగా పెట్టి వైసీపీ అంతిమంగా ఆయన్ని బలిపశువుని చేసింది. చెవి రెడ్డిని ఒంగోలు ఎంపీగా పెట్టె బదులు ఆయన్ని లేదా ఆయన ఫ్యామిలీ నుంచి బాబుకి పోటీగా అభ్యర్థులని పెట్టి ఉంటే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: