జగన్ మేనిఫెస్టో: బీసీలకు వరాల జల్లు.. రూ.1,50,000 పెంపు..!

Divya
* జగన్ మేనిఫెస్టోతో బీసీలకు వరాలు
* వైయస్సార్ చేయూత కొనసాగిస్తూ రూ.1,50,000 లాభం..
* ప్రజలకు మళ్లీ అండగా వైయస్ జగన్..
(అమరావతి - ఇండియా హెరాల్డ్ )
గడిచిన 58 నెలల కాలంలో తాము చెప్పిన హామీలను నెరవేర్చామని .. ఈ తీరు చరిత్రలోనే నిలిచిపోతుందంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు.. ఎలాంటి సమస్యలు వచ్చినా.. తాను చిరునవ్వుతోనే ప్రజలకు అండగా ఉంటానని.. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను అందించామంటూ చెప్పుకొస్తున్నారు సీఎం జగన్.. ఈ రోజున తాడేపల్లి కార్యాలయంలో మేనిఫెస్టోను 2024 కు సంబంధించి విడుదల చేశారు.
ఇక గత పాలనలో ప్రవేశపెట్టిన నవరత్నాలను ఈసారి కూడా కొనసాగిస్తూ కాస్త మార్పు చేసినట్లు స్పష్టమవుతుంది.. ఈ క్రమంలోని బీసీలకు ఈయన వరాల జల్లు కురిపించారు..  నాలుగు దఫాలుగా వైయస్సార్ చేయూత పథకం కింద బీసీ మహిళలకు 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన వారికి ఏదైనా సొంత వ్యాపారం చేసుకునేందుకు వాళ్ల శాయశక్తులా ప్రయత్నించేందుకు  ఈ వైఎస్ఆర్ చేయూత పథకాన్ని మొదలుపెట్టామని.. ఇప్పటివరకు నాలుగు సార్లు కి కలిపి 75 వేల రూపాయలు ఇచ్చామని తెలుపుతున్నారు. అయితే ఈ పథకాన్ని మళ్లీ అలాగే కొనసాగిస్తూ.. 1,50,000 రూపాయల వరకు కొనసాగిస్తామంటూ తెలియజేశారు.
ఇప్పటివరకు బీసీలు నాలుగు దఫాలలో 75 వేల రూపాయలను సొంతం చేసుకోగా మరో నాలుగు సంవత్సరాలలో నాలుగు దఫాలలో మరో 75 వేల రూపాయలను తమ ఖాతాలో వేసుకోబోతున్నారు.  ఏది ఏమైనా  వైఎస్ జగన్ పాలనలో మొత్తంగా రూ.1,50,000 వారు సొంతం చేసుకోబోతున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా వై.యస్.జగన్ ప్రవేశపెట్టిన ఈ మేనిఫెస్టో బీసీలకు వరాల జల్లు కురిపిస్తోందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు వైఎస్ జగన్.. ముఖ్యంగా రెండు పేజీల మేనిఫెస్టోతో తాము చేయగలిగిన పథకాలను మాత్రమే ప్రవేశపెట్టాము అని .. తమ మేనిఫెస్టోని ప్రజలు ఆదరిస్తారని గట్టిగా విశ్వసిస్తున్నామంటూ జగన్ వెల్లడించారు. మొత్తానికైతే మళ్లీ కొన్ని పథకాలను కొనసాగిస్తూ.. మరికొన్ని పథకాలలో మార్పులు తీసుకొస్తూ.. జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ప్రజలకు వరాల జల్లు కురిపిస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: