ముస్లిం దేశాలతో చేతులు కలిపిన అమెరికా?

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమై ఐదు నెలలకు పైనే అవుతుంది. తొలుత హమాస్ మెరుపు దాడులతో ఈ యుద్ధానికి బీజం వేయగా అందుకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ ను అంతమొందించాలనే లక్ష్యంతో గాజాపై వైమానిక, భూతల దాడులతో విజృంభిస్తోంది.

హమాస్ ను నామ రూపాల్లేకుండా చేస్తాం వాళ్లు ఎక్కడ ఉన్నా సరే తుదముట్టించే వరకు దాడులను ఆపే ప్రసక్తే లేదని బెంజిమాన్ నెతన్యాహూ స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా హమాస్ కి ఓ స్ర్టాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రంజాన్ నాటికి మిగిలిన బందీలను విడుదల చేయకపోతే వచ్చే నెలలో రాఫాపై దీర్ఘకాలం పాటు భీకర దాడులను చెస్తామని హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నా అవి విఫలమవుతూనే వస్తున్నాయి.

ఒకవేళ బందీల ఒప్పందం కుదిరినా.. కుదరకపోయినా హమాస్ పై తాను చేసిన ప్రతిజ్ఙను కచ్చితంగా చేరుకుంటానని నెతన్యాహూ స్పష్టం చేశారు. అయితే ఇజ్రాయెల్ దాదాపు మూడొంతుల వరకు పాలస్తీనాను ఆక్రమించింది. ఇక తదుపరి రఫాపై పట్టు సాధిస్తే పాలస్తీనా మొత్తం ఇజ్రాయెల్ చేతుల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు పాలస్తీనా ప్రత్యేక దేశం అనే అవకాశం ఉండదు. ఈ సమయంలో పాలస్తీనాలో ఉన్న హమాస్ తీవ్రవాదులు, ఇతర ముస్లింలు ఈజిప్టు దేశాలకు వలస వెళ్లాల్సి ఉంటుంది.

ఇది జరగకూడదనే ఉద్దేశంతో అరబ్ దేశాలు అమెరికా ద్వారా ఇజ్రాయెల్ పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం తమకు పాలస్తీనా అవసరం లేదని.. కానీ అక్కడ సరైన పాలన లేకుంటే ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు దాడులు చేసినట్లు భవిష్యత్తులోను తమపై దాడులు జరుగుతాయని పేర్కొంటుంది. ఇప్పుడు అమెరికాతో పాటు అరబ్ దేశాలు సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్ వంటి దేశాలు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చాయి. పాలస్తీనా ఒక ప్రత్యేక దేశంగా ఉండేలా చూస్తూ అక్కడి పాలనపై పర్యవేక్షణను ఒక కూటమికి అప్పగించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో దాడులు ఆగుతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: