బీజేపీకి చెంపదెబ్బలా ఆ మేయర్ ఎన్నిక?

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై వ్యవహారం బీజేపీకి తలవంపులు తెచ్చిపెడుతోంది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక వ్యవహారంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక ఉతర్వులు ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపుతోంది. మేయర్‌ ఎన్నికకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలు, వీడియోను తమ ముందుంచాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఆ పార్టీకి సుప్రీంకోర్టులో చీవాట్లు తప్పదని తెలుస్తోంది. ఆ రికార్డులన్నింటిని సురక్షితంగా దిల్లీకి చేరవేసేందుకు ఒక జ్యుడీషియల్ అధికారిని నియమించాలని పంజాబ్ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు మొదటి నుంచి వచ్చాయి. ఈ చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికను రద్దు చేసి, మళ్లీ పోలింగ్‌ జరిపించాలని కోరుతూ ఆమ్‌ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆప్‌ వేసిన ఈ పిటిషన్‌ను విచారిస్తోంది. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో జరిగిన నేతల కొనుగోలు అంశం తమను బాధించిందని ఇప్పటికే త్రిసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది కూడా.

బ్యాలెట్ పత్రాలపై ఇన్‌టూ మార్క్‌ ఎందుకు వేశారని రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసిహ్‌ను త్రిసభ్య ధర్మానసం ఇప్పటికే ప్రశ్నించింది. అయితే ఇందుకు ఆయన చెప్పిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. చెల్లుబాటుకాని బ్యాలెట్ పత్రాలపై ఇన్‌టూ మార్క్‌ వేశానని అనిల్ చెబుతున్నా.. అలా ఎనిమిది పత్రాలపై అలా వేసినట్లు ఆయన త్రిసభ్య ధర్మాసనానికి తెలిపారు. అయితే ఆప్‌ కౌన్సిలర్లు గందరగోళం సృష్టించారని.. బ్యాలెట్ పత్రాలు లాక్కోవడానికి యత్నించారని ఆయన ఆరోపించడం విశేషం.

అయితే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఒక రిటర్నింగ్ అధికారిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ క్రాస్‌ ఎగ్జామినేషన్ చేయడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. ఇక్కడ ఆప్- కాంగ్రెస్‌ కూటమికి తగినంత బలం ఉన్నా.. బీజేపీకి తగిన బలం లేకపోయినా రిటర్నింగ్ అధికారి పక్షపాతంలో బీజేపీ గెలిచినట్టు ప్రకటించారు. దీంతో మేయర్‌గా బీజేపీ అభ్యర్థి ఎన్నికయ్యారు. ఈ వివాదం నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేశారు. మొత్తానికి ఇదంతా బీజేపీకి చెడ్డపేరు తెస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: