గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్‌ మారణహోమం?

ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం గత నెల రోజులుగా కొనసాగుతూనే ఉంది. రెండు వర్గాల మధ్య భీకర పోరు రోజురోజుకి తీవ్ర స్థాయికి చేరుతుంది. హమాస్ నెట్ వర్క్ ని మట్టుబెట్టడమే లక్ష్యంగా గాజా పట్టీపై ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంలో కొంతమంది అమాయకులు సైతం చనిపోతున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు మరణించిన పాలస్తీనియన్లు సంఖ్య పది వేలకు చేరింది.


అయితే గాజా పాలస్తీనాకి సంబంధించిన ముఖ్య కేంద్రం. వాస్తవానికి పాలస్తీనా అనే దేశమే లేదు. ఇజ్రాయెల్ ను బ్రిటీష్ వారు ఆక్రమించుకొని పరిపాలించారు. ఆ తర్వాత ఈజిప్టు దగ్గర నుంచి యూదులు భూమిని కొనుగోలు చేసి పాలస్తీనాను ఏర్పాటు చేసుకున్నారు. దీనికి డబ్బులు ఇచ్చిందే ఇజ్రాయెల్. కానీ పాలస్తీనా, గాజాలో జరుగుతుంది ఏంటంటే.. అమెరికా, యూరప్ దేశాలు అందించిన మానవతా సాయం, అరబ్ దేశాలు ఇచ్చిన మత సాయంతో అక్కడ రెండు గాజాలు ఏర్పడ్డాయి. అదే పైన ఒక గాజా.. భూ అంతర్భాగంలో మరో గాజా. ఇక్కడ హమాస్ ఉగ్రవాదులు తల దాచుకుంటున్నారు.  


అయితే ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు, విశ్వ విద్యాలయాలు, కళాశాలు, పాఠశాలలు ఇలా అన్నింటిపై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నారని.. అంతర్జాతీయ మీడియాతో పాటు అరబ్ దేశాలు, ఐరాస చెబుతున్నప్పటికీ అక్కడ హమాస్ స్థావరాలను ఏర్పాటు చేసుకొని తమ కార్యకలాపాలను సాగిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.


ముందుగానే గాజాను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్ సూచించింది. అయితే వారిలో కొంతమందిని బలవంతంగా హమాస్ తీవ్రవాదులు ఆపి వారిని అడ్డు పెట్టుకొని దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రతిఘటిస్తే ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై దాడులు అని చెబుతున్నారు. తాజాగా అల్ అజార్ యూనివర్శిటీని ఖతార్ నిర్మించి ఇచ్చింది.  దీనిని ఇజ్రాయెల్ బాంబులతో పేల్చేసింది. ఎందుకంటే దాని నిండా మందుగుండు సామగ్రి, ఆయుధాలు, డ్రోన్లు తదితర వాటిని హమాస్ తీవ్రవాదులు భద్రపరిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: